కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడండి: కేజ్రీవాల్

ఢిల్లీ మురికివాడ ప్రజలకు మాజీ సీఎం పిలుపు;

Update: 2025-06-29 12:15 GMT
అర్వింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కూల్చివేతలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మురికివాడ ప్రజలను కోరారు. భవిష్యత్ లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ- కాంగ్రెస్ కూటములను తిరస్కరించాలని కోరారు.

ఢిల్లీ లోని మురికివాడల్లో జరుగుతున్న కూల్చివేతలకు నిరసనగా ఆప్ పార్టీ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ జహాన్ ఝగ్గీ, వహాన్ మకాన్ అన్నారు. కానీ ఆయన ఉద్దేశం జహాన్ ఝగ్గీ, వహాన్ మైదాన్ అన్నారు. ఆయన ఇచ్చే వాగ్థానాలు అబద్దాలని అన్నారు.
భవిష్యత్ లో హామీల వలలో మీరు పడకూడదని ముందు జాగ్రత్తగా చెబుతున్నానని అన్నారు. గత ఐదు నెలల్లో రేఖా గుప్తా సర్కార్ ఢిల్లీ ప్రభుత్వాన్ని నాశనం చేసిందని ఆప్ జాతీయ కన్వీనర్ ఆరోపించారు.
‘‘మేము చాలా బాగున్న ఢిల్లీని వదిలి వెళ్లాము. కానీ ఈ వ్యక్తులు దానిని నాశనం చేశారు. చాలాకాలంగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. పాఠశాల ఫీజులు పెంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీని దోచుకోవడంలో బిజీగా ఉన్నారు’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.
మురికి వాడల ప్రజలు ఐక్యంగా ఉండాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ‘‘40 లక్షల మంది మురికివాడల నివాసితులు ఉన్నారు. మీరు రోడ్లపైకి వస్తే వారు కూల్చివేతలను ఆపవలసి వస్తుంది.’’ అన్నారు.
‘‘అన్నా ఉద్యమం జంతర్ మంతర్ నుంచి ప్రారంభమై కాంగ్రెస్ ను అధికారం నుంచి తొలగించింది. ఇక్కడి నుంచి కొత్త ఉద్యమం ప్రారంభమవుతుంది. అధికారంపై బీజేపీ పట్టు కూడా సడలిపోతుంది’’ అన్నారు.
భవిష్యత్ లో కాంగ్రెస్, బీజేపీ రెండింటీకి ఓటు వేయవద్దని ప్రజలను కోరుతూ రెండు పార్టీలు అన్నాచెల్లెల్లు లాంటి వారని అన్నారు.
పోరాటం చేస్తున్న ఆప్ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ బీజేపీని లక్ష్యంగా చేసుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘వారు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆట ఆపి ప్రజల కోసం పనిచేయండి’’ అని కేజ్రీవాల్ అన్నారు.
తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి సిసోడియా, జైన్ అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. గతవారం ఆసుపత్రి నిర్మాణ ప్రాజెక్ట్ లలో జాప్యానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై ఏసీబీ భరద్వాజ్, జైన్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Tags:    

Similar News