జార్ఖండ్ లో బీజేపీని దెబ్బ తీసిన పొలిటికల్ ‘ బంటి ఔర్ బాబ్లీ’
చూడటానికి ఆకర్షణీయమైన జంటే కాదు.. రాజకీయం గా ఎత్తులు వేయడంలో ఇద్దరికి ఇద్దరు సరిసాటని నిరూపించుకున్నారు. వారే జార్ఖండ్ సోరెన్ దంపతులు..
By : The Federal
Update: 2024-11-23 11:41 GMT
అవినీతి ఆరోపణలు..భూకుంభకోణం కేసులో అరెస్ట్.. సీఎం పగ్గాలు అందుకున్న వ్యక్తి నమ్మక ద్రోహం చేశాడు.. సీనియర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు.. అన్నింటికి మించి కుటుంబంలో అధికారంలో కోసం కోట్లాటలు..
కానీ ఈ సమస్యలన్నీ అధిగమించి జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం కూటమి ఘన విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ప్రస్తుతం కొనసాగించింది. మరోసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నాడు. అయితే ఈ విజయం ఊరికే రాలేదు.
రాజకీయాల్లో ‘బంటీ ఔర్ బాబ్లీ’ గా పేరు పొందిన హేమంత్ సోరెన్- కల్పనా సోరెన్ రాష్ట్రంలో పవర్ ఫుల్ జోడిగా పేరు పొందింది. ఇద్దరి జంట చూడటానికి ఆకర్షణీయంగానే కాదు.. ఎత్తులు వేయడంలో సరిసాటి అని నిరూపించుకున్నారు. భర్త అరెస్ట్ కాగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కల్పానా సోరెన్ భర్తకు అండగా నిలబట్టారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. రాజకీయంగా లాభించాలనే దాదాపు 200 ల సభల్లో జంటగా పాల్గొన్నారు. గిరిజనుల్లో తమ భర్త అరెస్టు పై సానుభూతి వచ్చేలా ఎత్తు వేశారు. ఇది బాగా ఫలించింది. జేఎంఎం పోటీ చేసిన 41 స్థానాల్లో 33 గెలుచుకుంది. ఈ విజయంతో ఇండి కూటమిలో హేమంత్ సోరెన్ కీలక నేతగా మారాడు.
బీజేపీకి ఆశాభంగం..
ఎన్నికల ముందు కీలక నేతలను బీజేపీ తమ పార్టీలోకి చేర్చుకుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ ను పార్టీలో చేర్చుకోవడంలో సఫలీకృతం అయింది. సీతా సోరెన్, లోబిన్ హెంబ్రోమ్ వంటి జేఎంఎం ప్రముఖులు బిజెపికి విధేయత చూపారు. అయితే ఇదే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతిని ఓట్లుగా మార్చుకోవడంలో జేఎంఎం సఫలం అయింది.
సానుభూతి తరంగం..
హేమంత్ - కల్పన ఇద్దరూ గిరిజన ఓటర్లలో సానుభూతి తరంగాన్ని సృష్టించగలిగారు. అధికార వ్యతిరేక సెంటిమెంట్ ఉన్నప్పటికీ, బిజెపి దీనిని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైందని పోల్ విశ్లేషకుల అభిప్రాయం.
బర్హైత్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్‌పై సోరెన్ 17,347 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అతని భార్య కల్పనా సోరెన్, 14వ రౌండ్ కౌంటింగ్ తర్వాత 1,612 ఓట్ల ఆధిక్యంలో ఉంది. జేఎంఎంకి తిరిగి జవసత్వాలు నింపిన ఘనత ఆమెదే. సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేర్చడంలో జేఎంఎం విఫలం అయినప్పటికీ సీఎం అరెస్ట్ పై దానికి సానుభూతి పెరిగింది. బీజేపీ సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లను ఉపయోగించుకుంటున్నారని ప్రచారం చేశారు. తనపై ద్వేష పూరిత ప్రచారం చేయడానికే 500 కోట్లు ఖర్చు చేశారని హేమంత్ సోరెన్ ప్రచార సభల్లో ఆరోపణలు గుప్పించారు.
అవినీతిపై బీజేపీ జేఎంఎంను టార్గెట్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా బిజెపి అగ్ర నాయకులు, అవినీతి, చొరబాటు ఆరోపణలపై JMM నేతృత్వంలోని సంకీర్ణంపై విమర్శలు చేస్తూ విస్తృతమైన ర్యాలీలలో ప్రసంగించారు. మనీలాండరింగ్ కేసులో ఐదు నెలలు జైలు జీవితం గడిపిన సోరెన్‌ను కూడా వారు లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఇవేవి ఓట్లను తీసుకురాలేకపోయాయి.