ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలి ఓటింగ్.. ఎలా ఉండబోతోంది?

జమ్మూకాశ్మీర్ లో అధికరణ 370 తొలగించిన తరువాత తొలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగడానికి ఏర్పాట్లు జరగబోతున్నాయి.

Update: 2024-03-30 06:35 GMT

కాశ్మీర్, కీర్తి ప్రతిష్టల స్మశానవాటిక అని ఢిల్లీ రాజకీయ నాయకులు అంటున్నారు. జమ్మూకాశ్మీర్ లోని ప్రవహిస్తున్న అన్ని నదులు ఎన్ని ఎత్తుపల్లాలు, ఎన్ని మలుపులు ఉన్నాయో.. ఇక్కడ కూడా అన్నే ఉన్నాయి. ఈ నదులన్నీ కూడా అనేక చారిత్రక ఘటనలకు సాక్షిగా ఉన్నాయి. జమ్మూ, కాశ్మీర్ సామాజిక-రాజకీయ దృశ్యాలకు సంబంధించినంత వరకు ఏ పరిస్థితి శాశ్వతం కాదు.

J&Kలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఒక దశాబ్దం క్రితం అంటే 2014లో జరిగాయి. 2019లో జరిగిన గత పార్లమెంటరీ ఎన్నికల తర్వాత ఇక్కడ అనేక మార్పులు వచ్చాయి. నిబంధన 370ని రద్దు చేశాక జమ్మూకాశ్మీర్ భౌగోళిక రూపం కూడా మారింది. అప్పట్లో రాష్ట్రంలో భాగంగా ఉన్న లద్దాక్ ఇప్పుడు ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం. అలాగే జెఅండ్ కే కూడా రాష్ట్ర హోదా నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది.
ఎన్నికల షెడ్యూల్
ఇంతకుముందు, J&Kలో ఆరు పార్లమెంట్ స్థానాలు ఉండేవి. లడ్డాక్ వేరే ప్రాంతంగా వెళ్లిపోవడంతో ఇప్పుడు ఐదు మాత్రమే ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు J&Kలో ఐదు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. లోక్‌సభ స్థానాలు ఉధంపూర్ (ఏప్రిల్ 19), జమ్మూ (ఏప్రిల్ 26), అనంతనాగ్-రాజౌరీ (మే 7) , శ్రీనగర్ (మే 13), బారాముల్లా (మే 20). ఒకే నియోజకవర్గం ఉన్న లడఖ్‌లో మే 20న ఓటింగ్ జరుగుతుంది.
అనేక రాజకీయ పార్టీలు
జే అండ్ కేలో అనేక మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) తమ రాజకీయ ఎత్తుగడను ఎలా వేయబోతున్నాయి. ఇది ఆసక్తికరం కానుంది? సజాద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ), అల్తాఫ్ బుఖారీ నేతృత్వంలోని అప్నీ పార్టీ (ఏపీ), గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) రానున్న ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతాయి? ఈ ఐదు ప్రాంతీయ పార్టీలే కాకుండా బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం) వంటి పార్టీలు, అవామీ ఇత్తెహాద్ పార్టీ (ఏఐపీ), అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ వంటి చిన్న గ్రూపులు ఉన్నాయి. ప్రజలు ఎలా ఆదరిస్తారు. ఏది జే అండ్ కే మనసు గెలుచుకుంటుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో మొహబూబా ముఫ్తి నేతృత్వంలోని పీడీపీ రాజకీయంగా బాగా బలహీన పడింది. అనేకమంది సీనియర్ నాయకులు పార్టీని విడిచివెళ్లిపోయారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మరికొంతమంది నాయకులను పార్టీ అధినాయకత్వం బహిష్కరించింది. ఇదిలావుండగా, శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి పిడిపి తన యువ నాయకుడు వహీద్ పర్రాను అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు ఫెడరల్‌కి తెలిపాయి.
సయ్యద్ అల్తాఫ్ బుఖారీ, మరో మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ PDP నాయకుడు, మార్చి 2020లో ‘అప్నీ’ పార్టీని స్థాపించారు. కొత్త రాజకీయ సంస్థను ప్రారంభిస్తున్నప్పుడు, బుఖారీ దీనిని "సామాన్య ప్రజల వేదిక"గా అభివర్ణించారు. అతను NC, PDP పాల్పడుతున్న "వంశపారంపర్య రాజకీయాలు" తిరస్కరించాడు.
ఏది ఏమైనప్పటికీ, J&Kలోని అన్ని ప్రధాన రాజకీయ నిర్మాణాలు అప్నీ పార్టీని "BJPకి చెందిన ఒక శాఖ"గా చూస్తాయి, అయితే చాలా మంది సజాద్ లోన్ స్ఠాపించిన PCని "BJP యొక్క B-టీమ్"గా పరిగణించారు.
పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీల వల్ల సంప్రదాయ ప్రాంతీయ పార్టీల ఓట్ల శాతం చీలిపోయే అవకాశం ఉందని రాజకీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ నూర్ బాబా అభిప్రాయపడ్డారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజౌరి-అనంతనాగ్ పార్లమెంట్ స్థానంలో బీజేపీకి ఇది కచ్చితంగా లాభిస్తుంది. ,” అని బాబా ది ఫెడరల్‌తో అన్నారు. "ఈ ఫ్రాగ్మెంటేషన్ ప్రభావం PDPని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది" అని అభిప్రాయపడ్డారు.
అవకాశాల కంటే సవాళ్లే ఎక్కువ..
డీలిమిటేషన్ అనంతర కసరత్తు, జమ్మూ కాశ్మీర్ సంప్రదాయ రాజకీయ నిర్మాణాలకు అవకాశాల కంటే సవాళ్లే ఎక్కువ ఎదుర్కొనుంది. ఇంతకు ముందు, ఉదాహరణకు, PDP నాలుగు దక్షిణ కాశ్మీర్ జిల్లాలు - పుల్వామా, షోపియాన్, కుల్గాం, అనంత్‌నాగ్‌లను తన కంచుకోటలుగా పరిగణించింది. దక్షిణ కాశ్మీర్‌లోని మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్‌లను గెలుచుకోవడం దాని అలవాటుగా ఉండేది.
డీలిమిటేషన్ తరువాత కొత్తగా ఏర్పడిన పార్లమెంటరీ సెగ్మెంట్‌ను ఇప్పుడు అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ (ఎల్‌ఎస్) నియోజకవర్గంగా పిలుస్తారు. ఈ నియోజకవర్గంలో 18 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో దక్షిణ కాశ్మీర్ నుంచి 11, పూంచ్ రాజౌరి నుంచి ఏడు స్థానాలు ఉన్నాయి.
పహాడీలు, ఓబీసీలు.. బీజేపీ వైపు ?
డిసెంబర్ 2023లో, రిజర్వేషన్ కోటాలను సవరిస్తూ జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023ను లోక్‌సభ ఆమోదించింది. మార్చి 2024లో, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని J&K పరిపాలన షెడ్యూల్డ్ తెగ (ST)లో ప్రభావవంతమైన పహాడీ కమ్యూనిటీతో సహా కొత్తగా చేర్చబడిన తెగలకు 10 శాతం రిజర్వేషన్‌ను మంజూరు చేసింది. అలాగే ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు)లో 15 కొత్త కులాలను చేర్చింది.
పీర్ పంజాల్ పరిధిలోని పహాడీ సామాజికవర్గం, ఓబీసీలను తమవైపు తిప్పుకోవడమే అధికార బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎన్‌సి అభ్యర్థి జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది 2019లో అనంత్‌నాగ్ పార్లమెంటరీ స్థానంలో 40,180 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన గులాం అహ్మద్ మీర్‌కు 33,504 ఓట్లు రాగా, పీడీపీకి చెందిన మెహబూబా ముఫ్తీకి 30,524 ఓట్లు లభించి మూడో స్థానంలో నిలిచారు. అయితే, 2014లో మెహబూబా ముఫ్తీ 2,00,429 ఓట్లతో 65,417 ఓట్ల తేడాతో అదే స్థానాన్ని గెలుచుకున్నారు.
అన్నీ మారిపోయాయి..
J&K ఎన్నికల మ్యాప్‌ మళ్లీ గీయబడిన తర్వాత, గతంలో ఉన్న అనంతనాగ్ లోక్ సభ సీటు మునుపటిలా లేదు. అనంత్‌నాగ్-రాజౌరీ సీటును బీజేపీ గెలుచుకునే అవకాశాలు సన్నగిల్లినప్పటికీ, తమ ఎజెండాను అమలు చేసేందుకు తగినన్నీ ఎత్తులు వేస్తుందని చెప్పవచ్చు. దాని వల్ల ఫలితం ఎటైనా మారచ్చు.
‘గుప్కర్’ కూటమికి దెబ్బ
అనంత్‌నాగ్-రాజౌరీ, శ్రీనగర్, బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గాలకు తమ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టాలన్న నేషనల్ కాన్పరెన్స్(ఎన్ సీ) నిర్ణయాన్ని గుప్కార్ డిక్లరేషన్ కు దెబ్బగా పలువురు రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కాశ్మీర్ లోయ, పిర్ పంజాల్‌లోని మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలనే నిర్ణయాన్ని ఈ పార్టీ నిరాకరిస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానాల నుంచి వరుసగా ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మియాన్ అల్తాఫ్ అహ్మద్‌లను పోటీకి దింపేందుకు ఎన్‌సి సిద్ధంగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో శ్రీనగర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి హస్నైన్ మసూది, బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి ఎం అక్బర్ లోన్ విజయం సాధించారు.
NC, PDP ఉనికి కోసం పోరాటం
NC, PDP రెండింటికీ అతిపెద్ద సవాళ్లను ఆయా పార్టీలు ప్రారంభించాక తొలిసారి ఎదుర్కొబోతున్నాయి. స్థిరమైన ఓటు బ్యాంకును పార్టీలు నిలుపుకుంటాయా? లేదంటే డీలా పడతాయా చూడాలి. నిబంధన 370ని తిరిగి పునరుద్దరించే ముందస్తు ప్రణాళిక రెండు పార్టీల్లోనూ అసలు కనిపించడం లేదు. వీరు సుప్రీంకోర్టు తీర్పుపైనే ఆశలు పెట్టుకోగా అది వీరికి అనుకూలంగా రాలేదు. ఇప్పుడు ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ట్వీట్ల పోరాటాలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు గతంలో లాగా కాశ్మీర్ లో ఆధిపత్యం వహించవు. అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే, బీజేపీకి కొంత ప్రయోజనం ఉంటుంది.
జమ్మూలో బీజేపీకి..
జమ్మూ ప్రాంతంలోని ఉదంపూర్, జమ్మూ స్థానాల్లో బీజేపీ పట్టు సాధించవచ్చు. ఫరూక్ అబ్దుల్లా శ్రీనగర్ లోక్ సభ సీటు గెలవడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. సజాద్ లోన్ బారాముల్లాలో NC అభ్యర్థి (బహుశా ఒమర్ అబ్దుల్లా)కి గట్టి పోటీ ఇస్తారని అంచనా, NC మియాన్ అల్తాఫ్ అనంతనాగ్-రాజౌరీని గెలవడానికి హాట్ ఫేవరెట్. అతనికి పహాడీ ప్రజలపై గణనీయమైన పలుకుబడి ఉంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో J&Kలోని మూడు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. జితేంద్ర సింగ్ ఉదంపూర్ లో గెలుపొందగా, జుగల్ కిషోర్ జమ్మూలో, జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ లడఖ్‌లో విజయం సాధించారు. అయితే, ముందుగా ఊహించిన విధంగా ఉదంపూర్, జమ్మూ స్థానాలకు పోటీ సూటిగా ఉండదు.
కాంగ్రెస్‌కు ..
ఈసారి ఉధంపూర్, జమ్మూ నియోజకవర్గాల్లో బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉదంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 2014 నుంచి వరుసగా మూడవ LS ఎన్నికలకు జితేంద్ర సింగ్‌ను పోటీకి దింపాలని బిజెపి పట్టుదలతో ఉంది, అయితే గులాం నబీ ఆజాద్ పార్టీ GM సరూరిపై విశ్వాసం ఉంచి పోటీకి నిలపబోతోంది.
అయితే, ఉధంపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ క్యాబినెట్ మంత్రి, డోగ్రా స్వాభిమాన్ సంఘాన్ (DSS) చైర్‌పర్సన్ చౌదరి లాల్ సింగ్‌ను ఎంపిక చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. PDP-BJP సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జమ్మూలోని కథువా ప్రాంతంలో ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించిన వారికి మద్దతుగా డోగ్రా నాయకుడు అయినా మంత్రి చౌదరి లాల్ సింగ్ నిలిచాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దాంతో తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆయన బీజేపీని వీడి తరువాత కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం బిజెపి అభ్యర్థి జితేంద్ర సింగ్‌పై కాంగ్రెస్ తరఫును పోటికి నిలబడబోతున్నాడు. లాల్ సింగ్ డోగ్రా మాట్లాడే బెల్ట్‌లలో క్రౌడ్-పుల్లర్‌గా ప్రసిద్ధి చెందాడు. జమ్మూలోని డోగ్రా కమ్యూనిటీపై గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాడు.
వామపక్షాలకు పెద్దగా..
కాశ్మీర్ లోయ నుంచి ఏకైక కమ్యూనిస్ట్ నాయకుడు MY తరిగామి దక్షిణ కాశ్మీర్‌లోని తన కుల్గామ్ అసెంబ్లీ స్థానాన్ని సులభంగా గెలుచుకున్నాడు, అయితే అతని పార్టీ, CPI(M), పార్లమెంటరీ ఎన్నికలలో లెక్కించదగిన శక్తి కాదు.
చివరగా చెప్పేదేంటంటే.. ఇది బిజెపి దాని ప్రాంతీయ మిత్రపక్షాలు నేషనల్ కాన్ఫరెన్స్ , కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి మధ్య త్రిముఖ పోరు కాశ్మీర్ లో జరగబోతోంది.
Tags:    

Similar News