వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దం: కపిల్ సిబల్
బీజేపీ రాజకీయ అజెండాలో భాగంగానే ఈ సంస్కరణలన్న కాంగ్రెస్ ఎంపీ;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-13 11:36 GMT
కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఇటీవల చట్టసభలు ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్దంగా అని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయన ‘ది ఫెడరల్’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఫెడరల్ ప్రతినిధి సంకేత్ ఉపాధ్యాయ్ తో మాట్లాడారు. ఈ బిల్లులోని అంశాలు ఆర్టికల్ 25, 26 ప్రకారం ముస్లిం సమాజం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని సిబల్ చెప్పారు.
మత సంస్థల లౌకిక అంశాలను నియంత్రించవచ్చు కానీ చట్టం మత స్వేచ్ఛలు, పరిపాలనలోకి ప్రవేశిస్తుందని, ముస్లిం సమాజం వక్ఫ్ ఆస్తులపై దాని స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందని ఆయన వాదించారు.
‘‘ఎవరూ, ఎక్కడ, ఎలా పూజించాలనే విషయంలో రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పిచింది’’ అని ఆయన నొక్కి చెప్పారు. అటువంటి చట్టం ద్వారా ప్రభుత్వం ఈ హక్కులను నియంత్రించలేదని అన్నారు.
ప్రమాదంలో హక్కులు..
ఈ సవరణ ప్రభుత్వం వక్ఫ్ బోర్డులపై ఆధిపత్యం చెలాయించడానికి వీలు కల్పిస్తుందని, ముస్లింయేతర సభ్యులను నియమించడం ద్వారా సమాజ నిర్మాణాలను దెబ్బతీస్తుందని సిబల్ హైలైట్ చేశారు.
‘‘హిందూ ఎండో మెంట్లలో నామినీలందరూ హిందువులే, ఇతర తెగలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ముస్లింలకు మాత్రమే ఈ మార్పు ఎందుకు?’’ అని ఆయన ప్రశ్నించారు.
చట్టం ప్రకారం సమాన హక్కులు అనే సూత్రాన్ని వక్ఫ్ సవరణ చట్టం ఉల్లంఘిస్తుందని ఆయన చెప్పారు. ఈ చట్టం మతపరమైన వ్యవహారాల్లో రాష్ట్ర జోక్యానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
ప్రస్తుతం చట్టం ప్రకారం.. ముస్లింలు వక్ఫ్ అనే భావన రద్దు చేస్తుందని, ఇది రామ జన్మభూమి తీర్పులో కూడా గుర్తించబడిన మతపరమైన ఆచారమే అన్నారు. అటువంటి చర్య రాజ్యాంగ విరుద్దం మాత్రమే కాకుండా న్యాయపరంగా గుర్తించబడిన మతపరమైన ఆచారాలను కూడా బలహీనపరుస్తుందని సిబల్ తెలిపారు.
న్యాయమూర్తిగా ప్రభుత్వం ఉంది
చట్టంలోని వివాదాస్పద పరిష్కార యంత్రాంగంలో రూపొందించబడిన కొన్ని అంశాలు పూర్తిగా విరుద్దంగా ఉన్నాయని అన్నారు. వక్ఫ్ బోర్డు, ప్రభుత్వానికి మధ్య భూమి విషయంలో వివాదం తలెత్తితే, ఆ విషయాన్ని ప్రభుత్వం నియమించిన అధికారి నిర్ణయం తీసుకుంటారు.
‘‘ప్రభుత్వం తన కేసులో ఎలా న్యాయమూర్తిగా ఉంటుంది’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏదైన ఒక భూమిని వక్ఫ్ కు చెందదని ప్రకటించిన తరువాత బోర్డు తన విధులు నిలిపివేయాల్సిందే అని స్పష్టం చేస్తుందని, దీనికి ఎలాంటి అప్పీల్ లేకుండా ఉంటుందని ఇది రాజ్యాంగ విరుద్దం అని వ్యాఖ్యానించారు.
చట్టపరంగా సాయం అందుబాటులో ఉన్నప్పటికీ అధికార పరిధిలోని అడ్డంకులు, సంవత్సరాల తరబడి కొనసాగుతున్న వ్యాజ్యాలు వక్ఫ్ బోర్డు న్యాయం కోరడం దాదాపు అసాధ్యమని సిబల్ హెచ్చరించారు. వివాదం పరిష్కారమయ్యే సమయానికి, మనలో చాలామంది జీవించి ఉండకపోవచ్చని అని వ్యాఖ్యానించారు.
రాజకీయ అజెండాలో భాగం..
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి వక్ఫ్ ఆస్తులను ఉపయోగిస్తున్నారని ప్రభుత్వ వాదనను కపిల్ తోసిపుచ్చారు. ‘‘400 సంవత్సరాల క్రితం రాసిన పత్రం ఎలా ఉన్నాయో ఎవరికి తెలుసు’’ అని ఆయన అడిగారు. వాటిని అసంబద్దం అని వివరించారు.
వక్ఫ్ సవరణ చట్టం అనేది సంస్కరణ చట్టం కాదని, ఇది కేవలం మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే రాజకీయ వ్యూహాంలో భాగమని ఆయన వాదించారు. అందులో భాగంగా లవ్ జిహాద్, యూసీసీ, ప్రార్థన స్థలాల చట్టం ఇవన్నీ వారి గురించే లక్ష్యంగా ఉన్నాయన్నారు.
మాంసం అమ్మకాలపై ఆంక్షలు, మదర్సా రిజిస్ట్రేషన్, ముస్లిం విద్యార్థులకు స్కాలర్ షిప్ ఉపసంహారణ వంటి ఉదాహారణాలను ఉటంకిస్తూ సిబల్ పరిణామాలను 2014 నుంచి ఆధిపత్య ఆధారిత రాజకీయాల్లో భాగంగా ఈ సంస్కరణలని అభివర్ణించారు.
విషపూరిత సంస్కరణలు..
తాను సంస్కరణకు వ్యతిరేకంగా కాదని, కానీ మతపరమైన సంస్థలలో ఏకరీతి సంస్కరణలు ఉండాలని తన ఆరాటం అని సిబల్ స్పష్టం చేశారు. ‘‘మీరు ఒక దేశం ఒకే చట్టం’’ అని చెబితే దానిని అన్ని వర్గాలకు వర్తింపజేయదన్నారు.
వక్ఫ్ బోర్డులలో ముస్లింమేతర నియామాకాలు ఎందుకు ఉండాలి. కానీ హిందూ ఎండోమెంట్లలో ఎవరూ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.
కొంతమంది వక్ఫ్ కార్యకర్తలు ఆ ఆస్తులను దుర్వినియోగం చేస్తారని ఆయన అంగీకరించారు. కానీ సంస్కరణలు మంచి విశ్వాసంతో జరగాలి. ఒక సమాజం లక్ష్యంగా చేసుకోవడానికి కాదని పునరుద్ఘాటించారు.
‘‘ఈ సంస్కరణలు ఆలోచన విషపూరితమైనంది. ప్రజా చర్చను కలుషితం చేయడానికి, ఎన్నికల లాభం కోసం మతపరమైన విభజనలను ఉపయోగించుకోవడానికి రూపొందించారు’’ అని ఆయన అన్నారు.
న్యాయ వ్యవస్థపై ఆశలు పెట్టుకున్నారు
సుప్రీంకోర్టులో ఈ చట్టంపై అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నారా? అని ప్రశ్నించినప్పుడూ ‘‘మేము ఆశతో జీవిస్తున్నాము’’ అని ఆయన అన్నారు. ఈ అంశంపై అనేక పిటిషన్లు కోర్టు తీసుకుందని, రాజ్యాంగ విలువల ఆధారంగా తీర్పు ఇవ్వగలదని ఆశిస్తున్నానని చెప్పారు.
మీడియా, న్యాయ వృత్తులతో సహా అనేక సంస్థలు రాజ్యాంగ విలువలను కాపాడటంలో విఫలమయ్యాయని సిబల్ విచారం వ్యక్తం చేశారు. ‘‘మనం డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమై ఉన్నాము.
కానీ రాజ్యాంగానికి కట్టుబడి ఉండటమే మన కార్యకర్తవ్యం’’ అని ఆయన అన్నారు. ఇది మైనారిటీలపై జరుగుతున్న చివరి దాడి కాదని తన ప్రసంగాన్ని ముగించారు. ఇది వారి(బీజేపీ) రాజకీయా నమూనా అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.