ఉగ్రవాదానికి స్పష్టమైన లక్ష్మణ రేఖ గీశాం: ప్రధాని

అడంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన నరేంద్ర మోదీ, ఉగ్రవాదాన్ని, దాని మద్దతుదారులను వేరుగా చూడమని హెచ్చరిక;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-13 12:13 GMT
అడంపూర్ వైమానిక స్థావరంలోకి సైనికులకు సెల్యూట్ చేస్తున్న ప్రధాని మోదీ

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ స్పష్టమైన లక్ష్మణ రేఖ గీసిందని, పొరుగు దేశం చేసే ఏదైనా ఉగ్రవాద దాడికి భారత్ కచ్చితమైన సమాధానం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

పంజాబ్ లోని అడంపూర్ వైమానిక స్థావరంలో వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘సర్జికల్ స్టైక్ సమయంలో వైమానిక దాడుల సమయంలో మనం ఇది చూశాము. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ తో భారత్ కొత్త అసాధారణమైన సైనిక చర్యకు దిగింది. భారత్ విధానం, ఉద్దేశ్యం, నిర్ణయాత్మకత సంగమం’’ అని అన్నారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం..
ఉగ్రవాదంపై భారత్ వ్యూహాన్ని వివరిస్తూ, ప్రధాని మాట్లాడారు. ‘‘నేను నిన్న చెప్పినట్లుగా భారత్ మూడు అంశాలపై నిర్ణయం తీసుకుంది. మొదటిది, భారత్ పై ఉగ్రవాద దాడి జరిగితే మేము నిర్మించిన మాదైన మార్గంలో సమాధానం ఇస్తాము. రెండవది భారత్ ఇక ఎటువంటి అణు బ్లాక్ మెయిల్ సహించదు. మూడోది ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ప్రభుత్వం, ఉగ్రవాద సూత్రధారులను ప్రత్యేక సంస్థలుగా మేము వేరుగా చూడము’’ అని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ లో ఇప్పుడూ ఏ ప్రదేశం ఉగ్రవాదులకు సురక్షితం కాదు. భారత్ పైకి చెడు చూపును నిలిపితే వారికి విధ్వంసం మాత్రమే మిగులుతుందని ఉగ్రవాద పితామహులు గ్రహించారు. మన సైన్యం, వైమానిక దళం, నేవీ సిబ్బంది పాకిస్తాన్ సైన్యాన్ని మట్టికరింపించింది. వారికి వారి స్థానాన్ని చూపించారు’’ అని అన్నారు.
‘‘ఆటంక్ కే ఆకావో కో సమాజ్ ఆ గయా హైకీ భారత్ కీ ఒరే నజర్ ఉతానే కా ఏక్ హి అంజామ్ హోగా తబాహీ ఔర్ మహావినాశ్(భారత్ వైపు కన్ను వేయడం అంటే ఒక్కటే ఫలితం విధ్వంసం, సంపూర్ణ వినాశనం) అని టెర్రరిస్టు మాస్టర్లు ఇప్పుడు అర్థం చేసుకున్నారు’’ అని మోదీ అన్నారు.
దుర్మార్గపు కుట్రలు విఫలం..
‘‘ఆపరేషన్ సిందూర్ తో భీకరంగా దాడి చేసిన శత్రువు ఈ వైమానిక స్థావరంపై దాడులు చేశాము. వారు మనదేశంలోని వైమానిక స్థావరాలపై అనేక సార్లు దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు మనల్ని మళ్లీ మళ్లీ లక్ష్యంగా చేసుకున్నారు. కానీ పాకిస్తాన్ దుష్ట కుట్రలు ప్రతిసారి విఫలమయ్యాయి’’ అని మోదీ అన్నారు.
సాయుధ దళాలను ప్రశంసిస్తూ ‘‘భారత్ మాతా కీ జై అనేది యుద్ధ నినాదం కాదు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసే వారి కోసం చేసే ప్రమాణం. ఇది దేశం కోసం ఏదైనా చేయాలనుకునే వారి స్వరం. ఇది నేలపై, నింగిపై నీటిపై చేసే మిషన్ల సమయంలో ప్రతిధ్వనిస్తుంది. మన డ్రోన్లు, క్షిపణులు లక్ష్యాలను ఛేదించినప్పుడూ ఒకే ఒక్క విషయం వినపడుతుంది.. అదే భారత్ మాతాకీ జై’’ అని అన్నారు.
మీరంతా మీ లక్ష్యాలను పరిపూర్ణతతో చేరుకున్నారని నేను గర్వంగా చెప్పగలని మోదీ అన్నారు. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలు, వారి వైమానిక స్థావరాలు మాత్రమే ధ్వంసమయ్యాయి. వారి దుర్మార్గపు కుట్రలు, దుష్టత్వం కూడా పూర్తిగా ఓడిపోయాయని ప్రధాని చెప్పారు.
అడంపూర్ ఎయిర్ బేస్..
ఈ రోజు ఉదయం పంజాబ్ లోని అడంపూర్ వైమానిక స్థావరానికి వెళ్లిన మోదీ, యుద్ద రంగంలో ఉన్న వైమానిక దళ సిబ్బందితో సంభాషించారు. అడంపూర్ స్థావరం దేశంలోనే రెండవ అతి పెద్ద వైమానిక స్థావరం, భారత్ లోని కీలక సైనిక ఆయుధాలకు నిలయంగా ఉన్న ఈ స్టేషన్ లోని విలువైన ఎస్ -400 వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించిన తరువాత ప్రధాని మోదీ వాటి ముందే ఉన్న ఫొటోలు బయటకు రావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
‘‘ఈ రోజు ఉదయం నేను ఏఎఫ్ఎస్ అడంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులు, సైనికులను కలిశాను. ధైర్యం, ధృడ సంకల్ఫం, నిర్భయతకు ప్రతిరూపంగా నిలిచే వారితో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికి భారత్ వారికి ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటుంది’’ అని ఆయన ఎక్స్ లో తెలిపారు.
‘‘దేశంలోని అన్ని వైమానిక స్థావరాల నాయకత్వానికి, భారత వైమానిక దళంలోని ప్రతి వైమానిక యోధుడికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నిజంగా అద్భుతమైన పనిచేశారు’’ అని ప్రధాని అన్నారు.


Tags:    

Similar News