ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగితే.. ఎన్డీయే ఓడిపోయినట్టే..

ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. 45,341 పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న పోలింగ్..

Update: 2025-11-06 10:29 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar)లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Polls) నిష్పక్షపాతంగా జరిగితే ఎన్డీఏ(NDA) కూటమికి ఓటమి ఖాయమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ఫలితంగా పేదలు, మహిళలు, యువత కోసం పనిచేసే భారత కూటమి అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోతీహరిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక ప్రసంగిస్తూ.. దేశాభివృద్ధికి అపార కృషి చేసిన బీహార్ ప్రజల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదని ఆరోపించారు.

"అభివృద్ధి కోసం కాకుండా మతం పేరుతో ఎన్డీఏకు ఓటు వేయాలని బీజేపీ నాయకులు ప్రజలను కోరుతున్నారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే.. ఎన్డీఏ కూటమి పాలన పోయి.. పేదలు, మహిళలు, యువత కోసం పనిచేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది," అని చెప్పారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన బాగోలేదంటూ..బీహార్‌లో మూడేళ్లలో 27 వంతెనలు కూలిపోయాయి" అని పేర్కొన్నారు ప్రియాంక.

 

కొనసాగుతోన్న పోలింగ్..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈరోజు (నవంబర్ 6) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 45,341 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ కొసాగుతోంది. 3.75 కోట్లకు పైగా ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వీరిలో భారత కూటమి (I.N.D.I.A Alliance) ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వంటి అగ్ర నాయకులు ఉన్నారు. రెండో దశ పోలింగ్ 11వ తేదీ జరుగుతుంది. ఫలితాలు నవంబర్ 14న ప్రకటిస్తారు.

Tags:    

Similar News