మోదీని ‘షో మ్యాన్’గా అభివర్ణించిన రాహుల్

'భాగీదారీ న్యాయ్ సమ్మేళన్'లో ప్రధానిపై విమర్శలు..;

Update: 2025-07-25 13:23 GMT
Click the Play button to listen to article

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(PM Modi) ప్రధాని మోదీ(PM Modi)ని ‘షో మ్యాన్‌’గా అభివర్ణించారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఏర్పాటుచేసిన ఓబీసీల 'భాగీదారీ న్యాయ్ సమ్మేళన్'లో ఆయన ఈ మాట అన్నారు. ‘‘మీడియా ఆయనను ఫోకస్ చేస్తుంది. అంతకుమించి ఆయనలో ఏమీ లేదు. నేను అతన్ని రెండుసార్లు కలిశాను. ఏమీ లేదని అర్థమైంది," అని రాహుల్ జోడించారు.

అది నా పొరపాటే..

తన 21 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓబీసీ(OBC)ల ప్రయోజనాలను కాపాడలేకపోయానని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సమస్యలపై మంచి అవగాహన ఉన్నా..ఓబీసీల సమస్యల విషయంలో లేదని అంగీకరించారు.

"నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ సరైన నిర్ణయం తీసుకున్నానో తెలిసింది. నాకు రెండు-మూడు సమస్యలు పెద్దగా కనిపిస్తున్నాయి. అందులో భూసేకరణ బిల్లు, MGNREGA, ఆహార బిల్లు విషయాల్లో పొరపాటు చేశా’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలో కుల గణన నిర్వహిస్తామని చెప్పారు.

Tags:    

Similar News