‘బాధితులకు అండగా ఉంటాం’

పాక్ షెల్లింగ్‌ కారణంగా పూంచ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. అండగా ఉంటాయని హమీ ఇచ్చారు.;

Update: 2025-05-24 12:05 GMT
Click the Play button to listen to article

కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. విమానాశ్రయం నుంచి నేరుగా పూంచ్ జిల్లాకు చేరుకున్నారు. పాక్ సాయుధ బలగాల షెల్లింగ్ వల్ల ఇళ్లు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించారు.

నివాసాలను టార్గెట్ చేశారు..

"పాక్(Pakistan) సాయుధ బలాగాలు పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకోవడం బాధాకరం. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలతో మాట్లాడా. వారి సమస్యలను జాతీయ స్థాయిలో వినిపిస్తా" అని రాహుల్ విలేకరులతో అన్నారు.

తరువాత ఎక్స్‌లో "ఈ రోజు పూంచ్‌లో పాకిస్తాన్ దళాల షెల్లింగ్‌లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కలిశాను. దెబ్బతిన్న ఇళ్ళు, చెల్లాచెదురుగా పడిఉన్న వస్తువులు, బాధాతప్త హృదయాలు, ఆత్మీయులను కోల్పోయిన బాధ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటా. కేంద్రం దృష్టికి వారి సమస్యలు తీసుకెళ్లి ఆర్థిక సాయం చేయిస్తాం," అని రాహుల్ ట్వీట్ చేశారు.

అనంతరం ఆయన జామియా జియా-ఉల్-ఉలూమ్, గురు సింగ్ సభ గురుద్వారాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. పూంచ్‌లో ఫిరంగి దాడులలో మరణించిన బాలుడు విహాన్ భార్గవ్ కుటుంబాన్ని కూడా కలిశారు. పూంచ్‌లోని క్రైస్ట్ స్కూల్‌ విద్యార్థులతో సంభాషించింది, ఫిరంగి కాల్పులకు ఈ స్కూల్‌ ధ్వంసమైంది. ఇద్దరు విద్యార్థులు, కవలలు జైన్, జోయా చనిపోయారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ జమ్మూ కాశ్మీర్ యూనిట్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జీఏ మీర్ ఉన్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత రాహుల్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సందర్శించడం ఇది రెండోసారి. దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి ఏప్రిల్ 25న ఆయన శ్రీనగర్‌ వచ్చారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు ఆయనను కలిశారు. పూంచ్‌లో ఫిరంగి దాడుల్లో మరణించిన బాలుడు విహాన్ భార్గవ్ కుటుంబాన్ని కూడా రాహుల్ గాంధీ కలిశారు.

పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో సుమారు వందమంది ఉగ్రవాదులు చనిపోయారు. 

Tags:    

Similar News