రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్..

ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండాలని, రాత్రివేళ బ్లాకౌట్ పాటించాలని పోలీసులు ప్రజలను కోరారు.;

Update: 2025-05-10 07:26 GMT
Click the Play button to listen to article

పాకిస్తాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంలో రాజస్థాన్ (Rajasthan) పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దు జిల్లాల్లో శనివారం హై అలర్ట్(High alert) ప్రకటించారు. అనవసరంగా బయటకు రాకుండా సాధ్యమయినంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. బార్మెర్‌లో హెచ్చరిక సైరన్‌ మోగించి గస్తీ ముమ్మరం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా బార్మర్, జైసల్మేర్‌లోని మార్కెట్లను కూడా మూసివేశారు. బికనీర్, శ్రీ గంగానగర్ జిల్లాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం రాత్రి జైసల్మేర్, బార్మర్ జిల్లాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. అయితే వాటిని భారత రక్షణ దళాలు కూల్చివేయడంతో ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం ఆ రెండు జిల్లాలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ల శిథిలాలు కనిపించాయి. 

Tags:    

Similar News