డేరాబాబాకు మరోసారి పెరోల్

రేప్ కేసులో దోషి, హర్యానాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్‌ అలియాస్ డేరాబాబాకు 30 రోజుల పెరోల్(Parole) మంజూరైంది.;

Update: 2025-01-28 08:31 GMT
Click the Play button to listen to article

‘డేరా సచ్చా సౌదా’ చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌(Gurmeet Ram Rahim) అలియాస్ డేరా బాబా(Dera Baba)కు మరోసారి పెరోల్ మంజూరైంది. 30 రోజుల పాటు పెరోల్ దక్కడంతో మంగళవారం ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హరియాణా రాష్ట్రం రోహ్తక్‌లోని సునారియా జైలులో ఉన్నారు.

హర్యానా రాష్ట్రం సిర్సాలోని తన ఆశ్రమంలో 2017లో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 16 ఏళ్ల క్రితం జర్నలిస్టు హత్య కేసులో జీవిత ఖైదు విధించారు.

ప్రతిసారి ఎన్నికలకు ముందు..

ఈ సారి ఢిల్లీ (Delhi polls) అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల ముందు పెరోల్‌పై బయటకు వస్తున్నారు డేరాబాబా. గతంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మూడు రోజుల ముందు రిలీజ్ అయ్యారు. అలాగే ఫిబ్రవరి 2022లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ జైలు నుంచి రెండుసార్లు విడుదలయ్యారు. జూన్ 19న హర్యానాలోని 46 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగడానికి రెండు రోజుల ముందు 30 రోజుల పాటు పెరోల్‌పై బయటకువచ్చారు. నవంబర్ 2022లో హర్యానాలోని అడంపూర్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికకు ముందు నెల అంటే అక్టోబర్‌లో విడుదల చేశారు.

రాజకీయ పార్టీలతో అనుబంధం..

డేరాబాబా నాయకత్వంలోని సిర్సా బేస్డ్ డేరా సచ్చా సౌదా.. వివిధ సమయాల్లో కాంగ్రెస్, BJPకి మద్దతిచ్చింది. 2007 పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. అయితే హర్యానాలో 2014 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ తొలిసారిగా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా డేరా బాబా పేరు ప్రస్తావించకుండానే మద్దతు ఇవ్వడంపై ప్రశంశలు కురిపించారు.

డేరా సచ్చా సౌదా చీఫ్‌కు హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌‌తో పాటు పొరుగు రాష్ట్రాలలో శాఖలున్నాయి. దేశంలో మిలియన్ల సంఖ్యలో అనుచరులున్నారు. వీరిలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వాళ్లే ఎక్కువ. వీరిలోనూ కూడా చాలా మంది దళితులే. 

Tags:    

Similar News