కేజ్రీవాల్‌ బెయిల్ పొడిగింపు పిటిషన్‌ను ఎందుకు తిరస్కరించారు?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పొడిగింపుపై సుప్రీం కోర్టు ఎలా స్పందించింది. అసలు ఎందుకు గడువు పెంచాలని కోరారు.

Update: 2024-05-29 09:54 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. పిటిషన్ విచారణకు అర్హమైంది కాదని పేర్కొంటూ.. రెగ్యులర్ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టు వెళ్లేందుకు కేజ్రీవాల్‌కు స్వేచ్ఛ ఉందని సుప్రీం రిజిస్ట్రీ సూచించింది.

మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన అభ్యర్థన మేరకు..లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10న సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌కు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రోజు (జూన్ 1) లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

బెయిల్ పొడిగింపు ఎందుకు?

అయితే వైద్య పరీక్షలు చేయించేందుకు బెయిల్ గడువును పొడిగించాలని ఆప్ చీఫ్ కోరారు. తన క్లయింట్ అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో కీటోన్ లెవల్స్ పెరగడంతో వైద్య పరీక్షలు చేయించేందుకు మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదించారు.

Tags:    

Similar News