‘KWIN సిటీ - గేమ్ ఛేంజర్‌ అవుతుంది’

ఉన్నత విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధనా కేంద్రాలు, గ్లోబల్ హెల్త్ సెంటర్‌లను ఆకర్షించడమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న KWIN సిటీని సీఎం ప్రారంభించారు.

Update: 2024-09-26 10:31 GMT

ముడా కేసుకు సంబంధించి అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ సబబేనని హైకోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు ప్రతిపక్షాలు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. అయితే వీటన్నిటికి సీఎం సిద్ధరామయ్య ఏ మాత్రం లెక్కచేయడం లేదు. గురువారం తన అధికారిక విధులను నిర్వహిస్తూ బిజీగా కనిపించారు. ఉన్నత విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధనా కేంద్రాలు, గ్లోబల్ హెల్త్ సెంటర్‌లను ఆకర్షించడమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న నాలెడ్జ్, వెల్‌బీయింగ్ అండ్ ఇన్నోవేషన్ సిటీ (KWIN సిటీ)ని సీఎం ప్రారంభించారు. 5,800 ఎకరాల విస్తీర్ణంలో దొబ్బాస్‌పేట దొడ్డబల్లాపుర మధ్య ఈ సిటీ నిర్మితమవుతుంది. బెంగళూరు విమానాశ్రయం నుంచి కేవలం 45 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. సిటీ సెంటర్ నుంచి 50 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇది కేవలం ప్రాజెక్ట్ మాత్రమే కాదని, సుస్థిరత, ప్రజా శ్రేయస్సు్ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో KWIN సిటీ గేమ్ ఛేంజర్‌గా మారుతుందని చెప్పారు. డిప్యూటీ ముఖ్యమంత్రి డికె శివకుమార్ మాట్లాడారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి MB పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్ర జిడిపికి KWIN నగరం ఎంతో దోహదపడబోతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags:    

Similar News