ఎట్టకేలకు, మంద కృష్ణ మాదిగ కన్న కలలు నిజమయ్యాయి
ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. 30 ఏళ్లుగా;
ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. బిల్లు ప్రతులను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కేంద్రం ఆమోదం రాగానే రాష్ట్రంలో వర్గీకరించిన రిజర్వేషన్ లు అమలు చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఒక్కొక్క రాష్ట్రం అమలు చేసేందుకు సిద్ధమౌతున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా సమర్పించిన నివేదికపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను చంద్రబాబు వివరించారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లును తొలుత ఏపీ అసెంబ్లీలో సమర్పించి చర్చించారు. జనాభా గణన పూర్తి కానందున ఎలాంటి సూచనలు చేయడం లేదని ఏకసభ్య కమీషన్ వివరించారు. 2026లో జరిగే జనాభా లెక్కల అనంతరం జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణకు సిఫార్సు చేసినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఎప్పటి నుంచో ఉందని గతంలోనే తాము ప్రతిపాదన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సంగతి గుర్తు చేశారు. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచామన్నారు. ఈ నివేదికను అందరి మద్దతుతో అసెంబ్లీ ఆమోదించింది. ఎస్సీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా విభజించేందుకు తాము 1996లోనే కమిటీ వేసిన సంగతి చంద్రబాబు గుర్తు చేశారు.
అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యాఖ్యలు ఉదహరిస్తూ బిల్లును సభలో ఉంచారు. ఇందులో భాగంగా ఏ కేటగరీలో రెల్లి మరో 12 ఉప కులాలు ఉంటాయి. ఇక బి కేటగరీలో మాదిగతో పాటు 18 ఉప కులాలుంటాయి. సి కేటగరీలో మాలతో పాటు 25 ఉప కులాలు ఉంటాయి. డి కేటగరీలో ఆది ఆంధ్ర సహా ఉప కులాలు ఉంటాయి. ఓ కులం లేదా సమూహం తగినంత ప్రాధాన్యత పొందకపోవడానికి కారణం వెనుకబాటుతనమని మంత్రి అనిత తెలిపారు. కమీషన్ నివేదిక అధ్యయనం, ప్రభుత్వ సూచనలు, సిఫార్సుకు మంత్రుల నేతృత్వంలోని కమిటీ ముందు ఉంచారు. ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మండలి కూడా ఆమోదించింది.
ఎస్సీ వర్గీకరణ అంశంపై చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు.
SC వర్గీకరణ ఇలా ఉంటుంది
1.గ్రూప్ A (రెల్లి మరియు సబ్ క్యాస్ట్ ) = 1%
2.గ్రూపు B (మాదిగ & సబ్ క్యాస్ట్ ) = 6.5%
3. గ్రూప్ C (మాల &సబ్ క్యాస్ట్ ) = 7.5%
1. మొదటి 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ A వారికి 1%, గ్రూప్ B వారికి 6%, గ్రూప్ C వారికీ 8% వస్తుంది
2. రెండవ 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ A వారికీ 1% గ్రూప్ B వారికీ 7%, గ్రూప్ C వారికి 7% వర్తిస్తుంది
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా అసమానతలు మాత్రం తొలగలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నామన్నారు. త్వరలో జనాభా గణన పూర్తయిన తరువాత జిల్లాల వారీగా విభజన చేస్తామన్నారు. అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ బిల్లుపై మాట్లాడారు. మంద కృష్ణ మాదిగ, చంద్రబాబు వల్లనే ఎస్సీ వర్గీకరణ ఇంతదూరం వచ్చిందన్నారు. మాదిగల ఆత్మ గౌరవం నిలబెట్టిన ఘనత మందకృష్ణకే దక్కుతుందన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా అసమానతలు మాత్రం తొలగలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నామన్నారు. త్వరలో జనాభా గణన పూర్తయిన తరువాత జిల్లాల వారీగా విభజన చేస్తామన్నారు. అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ బిల్లుపై మాట్లాడారు. మంద కృష్ణ మాదిగ, చంద్రబాబు వల్లనే ఎస్సీ వర్గీకరణ ఇంతదూరం వచ్చిందన్నారు. మాదిగల ఆత్మ గౌరవం నిలబెట్టిన ఘనత మందకృష్ణకే దక్కుతుందన్నారు.