యూనిఫామ్ ఉండదని.. ఊహించడమే కష్టంగా ఉంది
భావోద్వేగాల మధ్య ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విమరణ.;
ఇకపై పోలీసు యూనిఫామ్ వేసుకునే అవకాశం ఉండదని ఊహించడం కష్టంగా ఉందని డీజీపీ ద్వారకా తిరుమల రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ద్వారకా తిరుమలరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన పదవీ విమరమణ వీడ్కోలు పరేడ్‌ను శుక్రవారం మంగళగిరిలోని ఆరో బెటాలియన్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీరరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ భావోద్వాగానికి గురయ్యారు. తన జీవితంలో ఇవి ఉద్విగ్న భరిత క్షణాలుగా ఆయన పేర్కొన్నారు. తన పోలీసు డ్రెస్ గురించి, దానికి ఆయనకు ఉన్న అనుంబంధం గురించి చెబుతూ.. ఎమోషన్‌కు గురయ్యారు. తన 35 ఏళ్ల ఐపీఎస్ ప్రయాణం నేటితో ముగుస్తుందన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు తన మైండ్‌లో మెదులుతున్నాయన్నారు. దశాబ్దాలుగా తన శరీరాన్ని అంటుకొని ఉన్న పోలీసు యూనిఫామ్ ఇక రేపటి నుంచి లేదు కదా అనే ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఇది చాలా ప్రత్యేకమైన ఎమోషన్ అన్నారు. ఇది బాధ అని అనను.. అలా అని సంతోషమూ అని అనను.. కానీ ఇదొక ప్రత్యేకమైన ఎమోషన్ అని అన్నారు. ఖచ్చింతగా తన 35ఏళ్ల సుదీర్ఘ ఐపీఎస్ ప్రయాణం సంతృప్తికరంగానే ముగిసిందన్నారు.