ఇంటి దగ్గరికే రైతు బజార్, ఆంధ్రాలో కొత్త ప్రయోగం

రాష్ట్రంలో రైతు బజార్ల బలోపేతం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా శ్రమిస్తోంది. పలు నూతన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది.

Update: 2024-08-04 11:24 GMT

రాష్ట్రంలో రైతు బజార్ల బలోపేతం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా శ్రమిస్తోంది. పలు నూతన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు చేర్పాటు చేసి బియ్యం సహా పలు నిత్యావసర సరుకులను రాయితీకే ప్రజలకు అందిస్తోంది. తాజాగా రైతు బజార్ల బలోపేత అంశంలో కూటమి సర్కార్ మరో అడుగు ముందుకేసింది. అదే మొబైల్ రైతు బజార్లు. ఈ విషయం ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్నా అమల్లోకి మాత్రం రాలేదు. అమలు చేసేలా చర్యలు కూడా వేగవంతం కాలేదు. కాగా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రజల చెంతకే రైతు బజార్లను తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది. అందుకోసమే ఈ ప్రణాళిక అమలును వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా పలు జిల్లాల్లో మొబైల్ రైతు బజార్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని రైతు బజార్ల సీఈఓ శేఖర్ బాబు వెల్లడించారు.

తొలి విడత మొబైల్ రైతు బజాలర్లలో భాగంగా విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నాలు వంి నగరాల్లో అపార్ట్‌మెంట్లు, శివారు కాలనీల్లో ఉండే ప్రజలకు రైతు బజారు సేవలను అందుబాటులోకి తీసుకెళ్లాలని, అందుకోసం 100 మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు శేఖర్ వివరించారు. ఈ మేరకు తాము చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం గుంటూరు, విజయవాడలో కలిసి మొత్తం 16 రైతు బజార్లు మాత్రమే ఉన్నాయని, ఇక రాష్ట్రవ్యాప్తంగా 111 రైతు బజార్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటి సంఖ్యను గణనీయంగా పెంచడానికి కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే అంగర, రాయవరం, బాపట్ల, వేంపల్లి, వెలుగోడు, ఆత్మకూరు. పొద్దుటూరు, అనపర్తి, సాలూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, మదనపల్లిలో నిర్మించిన కొత్త రైతు బజార్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

వీటితో పాటుగా మొబైల్ రైతు బజార్ల ప్రణాళికతో ప్రజల ఇంటికే కూరగాయలు చేరవేసేలా కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నా సమాచారం. మొబైల్ రైతు బజార్ల ద్వారా రైతులకే కాకుండా ప్రజలకు కూడా మేలు చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. నాణ్యమైన, తాజా కూరగాయాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా వారి జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చవచ్చని ప్రభుత్వ యోచిస్తోంది. కాగా కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను ఈ మొబైల్ రైతు బజార్లుగా మార్చాలని గతంలో కూడా చర్చలు జరిగాయి. మరి ఇప్పటి ప్రభుత్వం అదే మార్గంలో వెళ్తుందా లేదంటే వేరే వాహనాలను ఏమైనా సమకూరుస్తుందా అనేది చూడాలి.

Tags:    

Similar News