పట్టువదలని విక్రమార్కునిలా చలమలశెట్టి ఇది నాలుగోసారి..

మూడు సార్లు ఓడిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌పై జనాల్లో సింపతీ వర్కవుట్ అవుతుందా..

Update: 2024-02-02 03:22 GMT
వైసీపీలో చేరిన చలమలశెట్టి సునీల్

యనో పెద్ద పారిశ్రామిక వేత్త.. వేల కోట్ల రూపాయల వ్యాపారం.. వితరణశీలన్న పేరు.. సొంత రాష్ట్రం నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్నది ఆయన కల. ఇప్పటికి మూడు సార్లు బరిలో నిలిచారు. అయినా ఫలితం దక్కలేదు. పట్టువదలి విక్రమార్కునిలా మళ్లీ పోటీకి సై అంటున్నారు. పట్టుబట్టి టికెట్ సాధించుకున్నారు. ఆయనే చలమలశెట్టి సునీల్‌. గ్రీన్‌కో కంపెనీ ప్రమోటర్‌. కాపు సామాజికవర్గానికి చెందిన వారు. కాకినాడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారు.

రుసగా మూడుసార్లు ఓటమి.. మూడు కండువాలు మార్చినా అదే రిజల్ట్.. గెలుపు దరిదాపుల్లోకి వెళ్లి వచ్చిన నాయకుడు. ఇప్పుడు నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాకినాడ గడ్డపై మూడు సార్లు ఓడిపోయినా నాల్గోసారి పట్టువదలని విక్రమార్కుడిలా కాకినాడ ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. మరి ఈసారైనా ఆయన్ను గెలుపు తలుపుతడుతుందా లేదా అనేది కాకినాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

కాకినాడ ఎంపీ కావాలన్నది చలమలశెట్టి సునీల్ కల. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లుగా గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. 3 సార్లు ఓటమిని చవి చూశారు. మూడు పార్టీల నుంచి పోటీ చేసినా గెలుపు మాత్రం దక్కలేదు. ఓడిన చోటే గెలిచి తీరాలన్న సంకల్పంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చలమలశెట్టి సునీల్.

పారిశ్రామిరంగంలో నెంబవర్‌గా వన్‌గా ఎదిగిన చలమలశెట్టి సునీల్ గ్రీన్ కో కంపెనీ ప్రమోటర్‌గా ఉన్నారు. వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన చలమలశెట్టి సునీల్ రాజకీయాల్లో కూడా తన సత్తా చాటాలని 15 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పోటీచేశారు. కాపు సామాజికవర్గాని చెందిన చలమలశెట్టి ఆ సామాజికవర్గం ప్రాబల్యం ఉన్నప్పటికీ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హవాతో 2009లో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరి అదే కాకినాడ సెగ్మెంట్‌లో మళ్లీ బరిలోకి దిగారు సునీల్. ఈసారి టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు.

క 2019 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి పోటీలోకి దిగారు చలమలశెట్టి సునీల్. కాకపోతే అప్పుడు టీడీపీ కండువా కప్పుకుని ప్రజల ముందుకు వెళ్లారు. కానీ సునీల్‌కు మూడోసారి కూడా ఓటమితప్పలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథం విజేతగా నిలిచారు.

ప్పుడు మళ్లీ వైసీపీ టికెట్‌ తెచ్చుకున్నారు చలమలశెట్టి సునీల్. అదే కాకినాడ ఎంపీ స్థానంలో నాలుగోసారి ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆయన సొంతూరు పత్తిపాడు నియోజకవర్గం వీరవరం కావడంతో బంధువర్గమంతా కాకినాడ ఎంపీ పార్లమెంట్‌ పరిధిలోనే ఉన్నారు. ఇంకోవైపు మూడు సార్లు ఓడిపోయిన సునీల్‌పై జనాల్లో సింపతీ వర్కవుట్ అవుతుందనే అంచనాలో ఉన్నారు. అందుకే సీఎం జగన్ ఆచూతూచి సునీల్‌కు టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

నాలుగోసారి పోటీలో ఉన్న చలమలశెట్టి సునీల్‌ను కాకినాడ ప్రజలు ఈసారైనా ఆశీర్వదిస్తారో లేదో చూడాలి. మొత్తానికి సునీల్ పై అధికార పార్టీ పెట్టుకున్న నమ్మకం ఏ స్థాయిలో ఫలిస్తుందో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News