శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.;
By : The Federal
Update: 2025-01-15 05:11 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కనుమ పర్వదినం సందర్భంగా బుధవారం శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకొంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు బుధవారం వేకువ జాము నుంచే భక్తులు క్యూ కట్టారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారి దర్శనం కోసం బార్లు తీరారు. భారీ భక్తులు వస్తుండటంతో దర్శనాలకు దాదాపు 4 నుంచి 5 గంటలు పడుతోంది.
అయితే భక్తుల రీద్దని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శన ఏర్పాట్లు చేపట్టారు. అందుకు తగ్గట్టుగా క్యూలైన్లు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు అల్పాహారం, మంచి నీళ్ల ఏర్పాట్లు చేపట్టారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు, క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్ వంటి స్నాక్స్‌తో పాటు తాగడానికి నీళ్లు అందిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో శ్రీశైలం క్షేత్రంలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను నిలుపుదల చేశారు. అలంకార దర్శనం మాత్రం భక్తులను అనుమతిస్తున్నారు.