పెళ్లిలో డ్యాన్సులేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు
అనాధలుగా మారిన భార్య, చిన్న పిల్లలను చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.;
కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానికులతో పెళ్లి మండపం కళకళలాడింది. అందరి సంతోషాల మధ్య పెళ్లి ఘనంగా జరిగింది. ఇక పెళ్లి ఊరేగింపు ప్రారంభమైంది. డీజే పాటలు, మ్యూజిక్‌తో ఊరేగింపు మొదలైంది. స్నేహితులు, బంధువులు డ్యాన్స్‌లకు దిగారు. తాను కూడా కాలు కలిపేందుకు ముందుకొచ్చాడు. స్నేహితులతో కలిసి డ్యాన్స్‌లు చేయడానికి ఉత్సాహం చూపించాడు. ఎంతో హుషారుతో డ్యాన్స్‌లు వేశాడు. అలా సరదాగా డ్యాస్సులు వేస్తున్న సమయంలో డ్యాన్సులేస్తున్న చోటునే ఒక్క సారిగా కుప్పకూలాడు. ఏమి జరిగిందో అని తేరుకొని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లో లోపే అతను కన్ను మూశాడు.
కేరింతల మధ్య సాగుతున్న పెళ్లి ఊరేగింపులో విషాదం అలుముకుంది. అప్పటి వరకు ఊరేగింపులో హుషారుగా గెంతులేసిన వ్యక్తి లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గుండెలు బాదుకుంటూ తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు. అనాధలుగా మారిన చిన్న పిల్లలను చూసి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. సంతోషంతో సాగాల్సిన పెళ్లి ఊరేగింపు విషాదంతో ముగిసింది. అత్యంత బాధాకరమైన ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.