ఆకలి నివారించకుండా విశ్వగురు అంటే ఎలా? : ఆర్థిక వేత్త మహేంద్రదేవ్‌

భారతం దేశంలో లక్షాలది మంది ప్రజలు నేటికీ ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. పుష్టికరమైన ఆహారం అందడం లేదు. పౌష్టిక ఆహార లోపంతో సతమతమవుతున్నారు.

Update: 2024-04-06 12:27 GMT
సెమినార్లో మాట్లాడుతున్న ఆర్థిక వేత్త మహేంధ్రదేవ్

(జి.విజయ కుమార్ )


ఆకలి కేకలు నివారించకుండ భారత దేశం విశ్వగురు ఎలా అవుతుదని ప్రముఖ ఆర్థిక వేత్త, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ ఎడిటర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. మహేంద్రదేవ్‌ అన్నారు. భారతం దేశంలో లక్షాలది మంది ప్రజలు నేటికీ ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. లక్షలాది మందికి పుష్టికరమైన ఆహారం అందడం లేదు. పౌష్టిక ఆహార లోపంతో సతమతమవుతున్నారు. వీటన్నింటిని సంపూర్ణంగా నివారించినప్పుడే భాదేశం విశ్వగురు అవుతుంది. కానీ ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయకుండా భారతదేశం విశ్వగురు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. సిటిజెన్స్‌ ఫర్‌ డెమోక్రెసీ ఆధ్వర్యంలో అభివృద్ధితో సంక్షేమం సుపరిపాలనకు సవాళ్లు అంశంపై శనివారం విజయవాడలో చర్చా గోష్టి జరిగింది.


ఈ సందర్భంగా మహేంద్రదేవ్‌ మాట్లాడుతూ భారత దేశంలో సుమారు 16 శాతం మంది ప్రజలు ఆకలి కేకలతో జీవిస్తున్నారు. మరో 35 శాత మంది భారతీయులు పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్నారు. ఆఫ్రికా దేశాల కంటే ఇండియాలోనే పౌష్టికాహార లోపం అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్రికాలో 25 శాతం ప్రజలు మాల్‌ న్యూట్రిషన్‌తో ఇబ్బందులు పడుతుంటే భారత దేశంలో అంత కేంటే ఎక్కువుగానే ఉన్నారని చెప్పారు. ఆకలి కేకలు నివారించడంతో పాటు పౌష్టికాహార లోపాన్ని పూర్తి స్థాయిలో నివారించి జీరో హంగర్‌ కోసం కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. దీని కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించి అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.


ప్రమాదకరంగా మహిళల్లో రక్త హీతన

భారత దేశంలో మరో ప్రమాదకర సమస్య మహిళల్లో రక్త హీనత. ఇది చాలా ఆంధోళనకరంగా మారింది. దేశ వ్యాప్తంగా దాదాపు 57 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉంది. దీనిపైన ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. బలాన్నిచ్చేందు బలవర్థకాలు సమపాళ్లల్లో ఉండే ఆరోగ్యకరమైన ఆహారం కోసం రోజుకు సుమారు రూ. 3డాలర్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అంత ఖర్చు పెట్టగలిగితేనే పౌష్టికాహాకాహారం లభిస్తుంది. కానీ భారత దేశంలో ప్రజలు అంత ఖర్చు భరించే స్థాయిలో లేరు. దాదాపు 77 శాతం ప్రజలు అంత ఆర్థిక భారాన్ని భరించే స్థాయిలో లేరన్నారు. ఇదే సమంయలో ఒబెసిటీ కూడా ప్రధాన సమస్యగా మారింది. మరి ముఖ్యంగా పట్టణాల్లో ఇది ఎక్కువుగా ఉంది. పాలకుల నిర్లక్షం వల్ల ఉపాధి కల్పన కూడా దేశంలో పెద్ద సమస్యగా అవతరించిందన్నారు.

ఉపాధికల్పన లేకుండా ఇంక్లూజివ్‌ గ్రోత్‌ను సాధించడం కష్టమన్నారు. 2000–12లో జీడీపీ వృద్ధిరేటు 6 శాతం ఉంటే ఉపాధి కల్పన 1,6 శాతంగా ఉంది. ఆ తర్వాత 2019 నాటికి అది 0.1శాతానికి తగ్గిపోయింది. దీనిని మెరుగు పరచడంలో కేంద్రం వైఫల్యం చెందిందన్నారు. 2005లో మహిళల ఉపాధి కల్పన 40శాతం ఉండగా 2017 నాటికి 22శాతానికి పడిపోయింది. తర్వాత 35 శాతానికి పెరిగిన ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువే. ఈ అంశంలో పొరుగు దేశమైన బాంగ్లాదేష్‌ ఇండియా కంటే మెరుగ్గా ఉందన్నారు. ఇది ఇంక్లూజివ్‌ గ్రోత్‌ లక్షణం కాదు. మ్యానిప్యాక్చరింగ్‌ రంగంలో ఉపా«ధి కల్పన దేశంలో 11 శాతం ఉంటే చైనాలో 30 శాతం ఉంది. దీనిపై ప్రముఖ రఘురామరాజన్‌ కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత 22 శాతం ఉన్నారు. అయితే వీరి నిరుద్యోగం స్థాయి చాలా ఎక్కువుగా ఉంది. సెకండరీ అంత కంటే ఎక్కువ చదువుకున్న వారి నిరుద్యోగం 18శాతం, డిగ్రీ అంత కంటే ఎక్కువ చదుకున్న వారిలో 28 శాతం నిరుద్యోగం తాండం చేస్తోంది. ఏపిలో 30 శాతానికి మించి ఉంది. నైపుణ్యాభివృద్ధి కల్పించడంలోను వెనుకబడి ఉంది. వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాల్లోను ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు.

సౌత్ కొరియా 96 శాతం ఉండగా ఇండియాలో కేవలం 4 శాతం మాత్రమే ఉంది. దీంతో ఆ రంగంలో ఉపాధి కల్పన లేకుండా పోయింది. 51 శాతం ఉపాధి కల్పన ఉన్నా.. వారికి సరైన నైపుణ్యాభివృద్ధి కల్పించడంలోను చర్యలు చేపట్ట లేదన్నారు. సస్టైనబులిటీ కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన అంశమన్నారు. తాత్కాలిక ఫలితాల మీద కాకుండా దీర్ఘ కాలిక ఫలితాలపై ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు. పర్యావరణ సమస్యలను అరికట్టేందుకు కూడా చొర చూపడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే ఉన్నాయన్నారు. ప్రమాదకర కార్భన్‌ కారకాలను నివారించేందుకు దేశ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో చర్యలు తీసుకోవడంలో దూర దృష్టి కనబరచడం లేదన్నారు. సంక్షేమాభివృద్ధి కూడా చాలా ముఖ్యమైనదే. కానీ వీటి కోసం చేస్తున్న అప్పులు భారీగా పెరిగి పోతున్నాయి. సుమారు రూ. 14లక్షల కోట్లు అప్పులు చేశారు. దీనికి వడ్డీలు కట్టడం కూడా చాలానే అవుతోంది. అధిక మొత్తంలో వడ్డీలే చెల్లిస్తుంటే ఇక అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారని.. దీని వల్ల ఫిస్కల్‌ డెఫిసిట్‌ భారీగా పెరుగుతుందని, పంజాబ్‌లో ఇది పెద్ద సమస్యగా మారిందన్నారు.

దేశంలో పేదరిక నిర్మూలన కించ చేపడుతున్న సంక్షేమ పథకాలు కూడా సమగ్ర దృష్టితో చేయడం లేదు. ఐఆర్‌డి కింద కానీ జాతీయ ఉపాధి హామీ పథకం కానీ సరిగా అమలు చేయడం లేదు. అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. అయితే కోవిడ్‌ సమయంలో చేపట్టిన పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కాస్త పర్వాలేదనిపించుకుందన్నారు. గతంలో తమిళనాడు మాజీ ఎంజి రామచంద్రన్‌ అమల్లోకి తెచ్చిన పౌష్టికాహారం, ఏపీ మాజీ ఎన్టీఆర్‌ తెరపైకి తెచ్చిన రూ. 2కిలో బియ్యం పథకాలు పర్వాలేదనిపించాయి. అయితే నాడు మార్కెట్‌లో రూ. 3 కిలో బియ్యం ఉంటే ఎన్టీఆర్‌ రూ. 2లకే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ధర చాలా ఎక్కువుగా ఉంది. ఇలాంటి సమయంలో రూ. 1కి కిలో బియ్యం ఇవ్వడం.. కొన్ని సందర్భాల్లో ఉచితంగా ఇవ్వడమనేది సమస్యగా మారిందన్నారు.

డీబీటీని తొలుత బ్రెజిల్‌లో తెరపైకి తెచ్చారు. అయితే షరత్తులతో కూడిన నగదు బదిలీ చేపట్టారు. అది కూడా పిల్లలు పాఠశాలలకు వెళ్తేనే వారికి అమలు చేశారు. అయితే దీనిపై నిత్యం పర్యవేక్షణలు చేపట్టేవారు. అలా అన్ని నిర్థారించుకున్నట తర్వాతనే నగదు బదిలీ చేసేవారు. ఇండియాలో అయితే ఎలాంటి షరత్తులు లేకుండానే డీబీడీ కింద నగదు బదిలీ చేస్తున్నారు. ఆఫ్రికా, ఆసియాలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అక్కడ చాలా దేశాల్లో అప్పులు భారీగా పెరిగాయన్నారు. చైనా, సౌత్‌ కొరియా వంటి దేశాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కల్పనలపై అధిక దృష్టి సారించారు. చైనాలో ల్యాండ్‌ రీఫామ్స్‌ కూడా చేపట్టారు. దీంతో పాటుగా హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం. అయితే ఇలాంటిది భారత దేశంలో లేదన్నారు. అందుకే హ్యూమన్‌ డెవలప్‌ ఇండెక్స్‌లో చైనా అగ్ర స్థానాల్లో ఉంటే ఇండియా అడుగు స్థానాల్లో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే సమస్య ఉందన్నారు. తూర్పు ఆసియా దేశాలు వాటి పెట్టుబడులు సుమారు 40 శాతం కంటే మించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం వెచ్చిస్తోంటే ఇండియా మాత్రం 3 నుంచి 4 శాతానికి పరిమితమైంది. బాంగ్లాదేశ్‌ అయితే ప్రత్యేకించి హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌పైనే దృష్టి పెట్టింది. అందుకనే భారత దేశం కంటే బాంగ్లదేశ్‌ మెరుగైన స్థానంలో ఉందని చెప్పారు. హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌లో కానీ మహిళలకు ఉపాధి కల్పించడంలో కానీ ఇండియా కంటే ముందుందన్నారు.

సంక్షేమాభివృద్ధిపై ప్రముఖ ఆర్థిక వేత్తలు రంగరాజన్, సుబ్బారావు ఇది వరకే పలు వ్యాసాలు రాశారు. ఉచితాలపై వారు ఆక్షేపించారన్నారు. ఉపాధి కల్పన, పౌష్టికాహారం అందించడం, అవసరమైన మేరకు బీడీటీలు మంచివే అని రంగరాజన్‌ చెప్పారని.. ఉచి విద్యుత్‌ సౌకర్యం, టీవీలు పంపిణీ చేయడం వంటివి మంచిది కాదని రంగరాజన్‌ చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఉచితాల వల్ల రాజకీయ ప్రయోజనాలు పోందేందుకే చూస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే చోటు చేసుకుంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీలన్నీ ఇలాంటి వాటినే తెరపైకి తెస్తున్నాయన్నారు. వీటి వల్ల బడ్జెట్‌ డెఫిసిట్‌ ఉంటుందని మరో ఆర్థిక వేత్త సుబ్బారావు పేర్కొన్నట్లు చెప్పారు. ఉచితాల ప్రభావం వల్ల ఇది ఏర్పడుతోందన్నారు. దీని కోసం అప్పులు తేవాల్సి వస్తుంది. ఇలాంటి వాటి వల్ల అభివృద్ది సాధ్యం కాదని సుబ్బారావు పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఇలా అప్పులు చేయడం అధికమయ్యే కొద్ది భవిష్యత్‌ తరాలపై అప్పుల భారం పెరుగుతుంన్నారు.

ఇది ఆర్థిక కుంగుబాటుకు దారి తీస్తుందన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చెప్పే గ్యారెంటీల వల్ల ఆర్థిక వ్యవస్థగా ప్రమాదకరంగా మారుతుంది. ఉచితాల వల్ల అనేక అనర్థాలు నెలకొంటాయి. పాలకులు అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని నియంతల్లా మారుతారు. మీకు ఉచితంగా పథకాలు ఇస్తున్నాము..మాకు ఓట్లేయండని అడుగుతారని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదన్నారు. మూల ధన వ్యయం కింద రూ. 1 ఖర్చు పెడితే దానికి రెట్టింపు ఆదాయం వస్తుంది. అదే రెవిన్యూ వ్యయం కింద రూ. 1 ఖర్చు పెడితే ఆదాయం ఏమీ రాదు. రెవిన్యూ వ్యయం కంటే మూలధన వ్యయం అనేది చాలా ముఖ్యమైంది.

వాజ్‌పేయి హయాంలో గోల్డన్‌ క్వాడ్రీలేటరల్‌ ట్రయాంగిల్‌ కింద ఏర్పాటు చేసిన జాతీయ రహదారుల వల్ల ఆయా ప్రాంతాల్లో చాలా అభివృద్ది జరిగింది. సూరత్, శ్రీకాకుళం వంటి జిల్లాలో కూడా ఇది సాధ్యమైంది. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే పేదరిక నిర్మూలన పథకాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చయడం వల్ల సా«ధ్యమవుతుంది. ఇది పలు సందర్భాల్లో నిరూపితమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎఫ్‌డి ఉపాధ్యక్షులు, మాజీ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎఫ్‌డీ కార్యదర్శి, మాజీ ఐఏఎస్‌ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సీఎఫ్‌డీ çసంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్‌రెడ్డి ప్రసంగించారు.


Tags:    

Similar News