వైఎస్సార్‌సీపీలో జల్సా రాయుళ్లు
వైఎస్సార్‌సీపీలో మహిళలను లైంగికంగా వేదించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉండటం విశేషం. వారు ఆపార్టీలో ముఖ్యనాయకులు. ఇప్పటికీ వారిని ఆరోపణలు వెటాడుతూనే ఉన్నాయి.
Byline : G.P Venkateswarlu
Update: 2024-08-14 03:34 GMT
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉండి జల్సాలు చేస్తూ ప్రజా ప్రతినిధి అన్న పదానికే మచ్చ తెచ్చారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారు ఐదుగురు ఉన్నారు. అన్ని కోణాల్లో పరిశీలిస్తే వీరు ప్రజా సేవలో ఉండేందుకు అర్హులు కాదనేది పలువురు మేధావులు చెబుతున్న మాట. అయితే ఆ పార్టీకీ వీరే ముఖ్య నాయకులుగా నేటికీ వ్యవహరిస్తున్నారు. వారు ఎవరు? వారు చేసిన చేస్టలు ఏమిటి? ఎందుకు వారు సమాజంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు...
1. వి విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు. 2016 లో రాజ్యసభకు ఎంపికయ్యారు. తిరిగి 2022లో రాజ్యసభకు వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి అంతకు ముందు వ్యాపార వేత్త, ఆడిటర్. వైఎస్సార్‌సీపీ రాజకీయాలు బాగా వంటబట్టించుకున్న నాయకుడుగా పేరు సంపాదించారు. విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు ఎక్కువగా చేశారు. అక్కడ దేవదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న శాంతితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఒక పిల్లాడికి తండ్రి అయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తరువాత వాణి కూడా తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి తన మొదటి భర్త అని, తాను ఆయనను వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, ఆ కక్షతోనే తనపై ఆరోపణలు మదన్‌మోహన్ చేశారని ఆరోపించారు. మదన్‌మోహన్ మాత్రం తన కుమారుడికి డిఎన్‌ఏ టెస్ట్ చేస్తే విజయసాయిరెడ్డి తండ్రి అని తేలుతుందన్నారు.
2. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాజీ ఎంపీ, మాజీ మంత్రి. భీమిలి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ముత్తంశెట్టి రాసలీలలు వెలగబెట్టారనే ఆరోపణలు ఎదర్కొన్నారు. ఒక మహిళకు ఫోన్‌చేసి లవ్‌యూ డార్లింగ్, లవ్‌యు బంగారం ఇప్పుడొస్తే ఆరగంటలో వెళ్లొచ్చు. నేను గెస్ట్‌హౌస్‌లో ఉన్నా అంటే అప్పట్లో ఆడియో టేపులు రిలీజ్ అయ్యాయి. నాకు సంబంధించినవి కాదని చెప్పినా ఎవ్వరూ విశ్వసించలేదు. పనులు చేసి పెడతానని మహిళలను లైంగికంగా వాడుకున్నారే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎంపీగా, మంత్రిగా రాజకీయాలు వెలగబెట్టిన వ్యక్తి ఆ హోదాలో ఉంటూ ఇలాంటి పనులు ఏమిటని పలువురి నోట నానారు.
3. అంబటి రాంబాబు. ఈయనకు సంబరాల రాంబాబు అనే పేరు శాశ్వతమైంది. సంక్రాంతి వంటి పండగలకు డ్యాన్స్‌లు వేయడం ఈయనకు అలవాటు. పలువురు మహిళలను లైంగికంగా వేదించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న కాలంలో ఆడియో టేపులు బయటకొచ్చాయి. ఈయన 1988లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్సార్ చనిపోయిన తరువాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తరువాత వైఎస్సార్‌సీపీలో చేరారు.
4. గోరంట్ల మాధవ్. ఈయన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఎంపీగా ఉంటూనే మహిళలను లైంగికంగా వేదించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. బట్టలు విప్పదీసి సెల్ ఫోన్ వీడియో కాల్ చేసి ఒక మహిళకు చూపిస్తూ చేసిన పిచ్చి చేస్టలు రాష్ట్రమంతా గుప్పుమన్నాయి. ఆ వీడియో తనది కాదని, మార్ఫింగ్ చేశారంటూ అప్పట్లో వాదించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఈయన పోలీసు అధికారుల సంఘానికి నాయకుడిగా కూడా గతంలో వ్యవహరించారు.
5. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. కోడుమూరు నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇంట్లో భార్యా భర్తలు పనివారుగా ఉన్నారు. వారికి ఆరోగ్యం బాగోలేక అప్పుడప్పుడు తమ కుమార్తెను పనికి పంపించే వారు. సుధాకర్ తన భార్య ఇంట్లో లేని సమయంలో పనిపిల్లను లొంగదీసుకుని మూడు సంవత్సురాలుగా తనను శారీరకంగా వాడుకున్నాడని ఆమె చేసిన ఫిర్యాదు మేరకు కటకటాల పాలయ్యాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ విషయం సంచలనంగా మారింది. కోర్టు సుధాకర్‌కు అప్పట్లో 14 రోజులు రిమాండ్ కూడా విధించింది.
6. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వైఎస్సార్‌సీపీ నాయకుడు. ఎమ్మెల్సీగా ఉన్నారు. తనను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య దువ్వాడ వాణి ఆరోపణలు గుప్పించారు. ఎన్నికలకు ముందు నుంచి భార్య, పిల్లలు దువ్వాడ తమను పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవల దువ్వాడ దివ్వల మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య, పిల్లలు ఆరోపించారు. దీంతో మాధురి చనిపోయేందుకు ప్రయత్నించింది. తమ జీవితాలు నాశనం అయ్యాయని దువ్వాడ భార్యా పిల్లు ఆరోపిస్తుంటే, తన జీవితం, తన పిల్లల జీవితం మాటేమిటని మాధురి ఆరోపిస్తున్నారు. భార్య ఉండగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడంటూ దువ్వాడా వార్తలకెక్కారు.