కోడి పందేల కంట్రోలింగ్‌కు లేడీ బౌన్సర్లు

నిర్వాహకుల నయా ట్రెండ్. ఈ సంక్రాంతి కోడి పందేలలో రంగంలోకి దింపిన లేడీ బౌన్సర్లు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.;

Update: 2025-01-15 07:01 GMT

నినిమా నటులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బాగా డబ్బున్న ధనవంతులు ప్రజల్లోకి వచ్చినప్పుడు, ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు వారికి ప్రజల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ప్రైవేటు సెక్యురిటీని ఏర్పాటు చేసుకుంటారు. ప్రజల నుంచి తమను తాము రక్షించుకునేందుకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటారు. బౌన్సర్లు వీఐపీలకు రక్షణ వలయంగా ఉంటూ.. ఎవ్వరినీ దగ్గరు రానీకుండా.. కాపాడుతుంటారు. అంతేకాకుండా తమ చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడం కూడా సమాజంలో ఒక స్టేటస్‌ సింబల్‌గా మారి పోయింది.

అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కోడిపందేల నిర్వాహకులు కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. సెక్యురిటీ కోసం ఏర్పాటు చేసుకునే ఈ బౌన్సర్ల సంస్కృతిని తాజాగా కోడి పందేలకు విస్తరింప చేశారు. కోడి పందాల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. బరిలో పందెపు రాయుళ్లను కంట్రోల్‌ చేసేందేకు బౌన్సర్లను రంగంలోకి దింపారు. గతంలో ఎన్నడు లేని ఈ çసంస్కృతిని ఈ సంక్రాంతి కోడి పందేల నుంచే ఆరంభించారు. అందులో లేడీ బౌన్సర్లను రంగంలోకి దింపడం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న కోడి పందేల బరువుల వద్ద ఈ లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేశారు. దాదాపు 50 నుంచి 100 మంది వరకు లేడీ బౌన్సర్లను రంగంలోకి దింపారు. టీనేజ్‌ యువతులను లేడీ బౌన్సర్లుగా రంగంలోకి దింపారు. డ్రెస్‌ కోడ్‌ను ఏర్పాటు చేయడంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కంప్లీట్‌ బ్లాక్‌ రంగులోని యూనిఫామ్‌ను వీరికి ఏర్పాటు చేశారు. బ్లాక్‌ టీషర్ట్, బ్లాక్‌ ప్యాంట్, బ్లాక్‌ క్యాప్‌తో పాటు ముఖానికి బ్లాక్‌ మాస్క్‌ను ధరించిన ఈ లేడీ బౌన్సర్లు కోడి పందేల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Tags:    

Similar News