పరిమితికి మించి ఎక్కారు..లిప్ట్‌లోనే ఇరుక్కొని పోయారు.
మూడు గంటల పాటు నరక యాతన అనుభవించారు. పోలీసుల సాయంతో బయట పడ్డారు.;
తొందరగా వెళ్లాలనే ఆత్రుత..ముందు ఎక్కాలనే తొందరపాటుతో ఎక్కిన లిఫ్ట్ అడుగు ముందుకు కదల్లేదు. ఎక్కాల్సిన వారి కంటే ఎక్కువ మంది ఎక్కడంతో లాగలేక లిఫ్ట్ లాక్ అయిపోయింది. బయటకు వచ్చేందుకు వీల్లేకుండా డోర్‌లు క్లోజ్ అయిపోయాయి. దీంతో ప్రయాణికులు అందులోనే ఇరుక్కొన్ని పోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు గంటల పాటు లిఫ్ట్‌లోనే ఉండి పోయారు. దీంతో ప్రయాణికుల్లో భాయాందోళనలకు గురయ్యారు. కేకలు వేయడం ఆరంభించారు. సమయానికి లిఫ్ట్ ఆపరేటర్లు, టెక్నీషియన్లు అక్కడ లేరు. లిఫ్ట్‌లో నుంచి వస్తున్న ప్రయాణికుల అరుపులు విన్న రైల్వే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు.
టెక్నీషియన్లు లేక పోవడంతో పోలీసులే టెక్సీషియన్లుగా మారారు. లిఫ్ట్ డోర్లను ఓపెన్ చేసేందుకు రంగంలోకి దిగారు. చాలా సేపు ప్రయత్నించిన తర్వాత లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. దీంతో ప్రయాణికులు బయటపడ్డారు. దాదాపు మూడు గంటల సేపు లిఫ్ట్‌లోనే మగ్గిపోయిన ప్రయాణికులు పోలీసుల సాయంతో ఊపిరి పీల్చుకున్నారు. లిమిటెడ్ సంఖ్యలో లిఫ్ట్ ఎక్కాలనే చిన్న కండిషన్‌ను పక్కన పెట్టి పరిమితికి మించి ఎక్కిన తప్పుకి మూడు గంటల పాటు లిఫ్ట్‌లోనే మగ్గాల్సి వచ్చింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.