బంగాళాఖాతంలో బలపడనున్న అల్పపీడనం

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది.

Update: 2024-11-25 04:58 GMT

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఆదివారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతోంది. ఇది క్రమంగా బలపడి సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రానికి తమిళనాడు–శ్రీలం వైపు పయనించనుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఈ నెల 27న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తక్కిన దక్షిణ కొస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. తీరం వెంబడి గంటకు 35కిమీ నుంచి 60కిమీ వేగంతో గాలులు వీచే అకాశం ఉందని, శుక్రవారం వరకు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించింది.

Tags:    

Similar News