తుఫాన్ దెబ్బ: జాతీయ రహదాారుల మూసివేత

ప్రకాశంతో జిల్లా ఎస్ పి ప్రకటన

Update: 2025-10-28 12:44 GMT

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు, మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాల ప్రభావం ఉండే జిల్లాల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని అత్యవసర చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాల రాకపోకలను ఈ రోజు రాత్రి 7.00 గంటల నుండి నిలిపివేశారు. అదే విధంగా అన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేల్లో ప్రైవేటు మరియు వాణిజ్య వాహనాల ప్రయాణం పూర్తిగా నిషేధించబడుతుంది.

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని లేదా సురక్షిత ప్రదేశాల్లో వాహనాలను నిలిపివేయాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వి. హర్షవర్ధన్ రాజు విజ్ఞప్తి చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా రోడ్లపై ప్రయాణాలు చేయకుండా సహకరించాలన్నారు.
ఈ ఆంక్షలు ఎవరి వ్యక్తిగత అసౌకర్యం కోసం కాకుండా, ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను కాపాడడమే లక్ష్యంగా అమలులోకి తెచ్చినవి. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే ఈ నిబంధనలు ఉపసంహరించబడతాయి. ఈ సమయంలో ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ,  పోలీస్ శాఖ నుండి జారీ అయ్యే హెచ్చరికలు, సూచనలు తప్పకుండా పాటించాలని మనవి చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కొరకు డయల్ 112కి, పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266 లేదా సంబంధిత స్ధానిక పోలీసు అధికారులకు సమాచారమివ్వాలని జిల్లా ఎస్పీ కోరారు.


Tags:    

Similar News