ఏపీ మంత్రి టీజీ భరత్ ను కలసిన పోతుగడ్డ చిత్ర యూనిట్‌

సినిమా కళాకారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి టీజీ భరత్‌ చెప్పారు.;

Update: 2025-02-02 12:19 GMT

‘పోతుగడ్డ’ చిత్రం ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో పోతుగడ్డ చిత్ర యూనిట్‌ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్‌ను మర్యాద పూర్వకంగా ఆదివారం ఉదయం కలిసింది. ఓటీటీలో విడుదలై అతి తక్కువ వ్యవధిలో విజయవంతమై సక్సెస్‌ రేట్‌ సాధించి దూసుకు పోతుందటం చిత్ర యూనిట్‌ కృషికి నిదర్శనమని సందర్భంగా చిత్ర యూనిట్‌ను మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్‌కి చిత్ర దర్శకుడు రక్షవీరం పోతుగడ్డ కథను వివరించారు. పోతుగడ్డ చిత్రం భిన్నమైన ఫ్యాక్షన్‌ ప్రేమకథా చిత్రమని, ఇందులో కక్షలు, ముఠాలే కాకుండా రాయలసీమ సాంస్కృతిక వైభవాన్ని కూడా తెలియజేస్తుందన్నారు. రాయలసీమ ప్రాంతంలో రాజకీయ నాయకుల కుయుక్తులు, ఎత్తుగడలు, అధికారం కోసం, పరువు ప్రతిష్టల కోసం, ఎవరినైనా హతం చేసే ఒక కొత్త కోణాన్ని కూడా అన్ని ఈ సినిమాలో ఆవిష్కరించడం జరిగిందన్నారు.
పోతుగడ్డ సినిమా ఆద్యంతమూ అనేక మలుపులతో సాగుతుందని, సామాన్య కుటుంబానికి చెందిన ఒక యువకుడు రాజకీయ నాయకుడి కూతురుని, పైగా ఎంఎల్‌ఏగా నాయకుడి కూతురుని ప్రేమిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ చిత్రం తెలియజేస్తుందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినిమా కళాకారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సందేశాత్మక చిత్రాలను నిర్మించి సమాజాన్ని మార్చవలసిన అవసరం కళారంగానికి ఉందని అన్నారు. దర్శకుడు రక్షవీరం, ఎడిటర్‌ శివకిరణ్, సంభాషణల రచయిత కెంగార మోహన్, నటులు అలంపురం రవికుమార్‌లు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
Tags:    

Similar News