విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ వచ్చేలా చేశాం

విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌;

Update: 2025-01-26 06:16 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ ప్రజలు ప్రస్తుతం అభివృద్ధిని కోరుకుంటున్నారు. దాని కోసం కూటమి ప్రభుత్వం కష్టపడి పని చేస్తోంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటడి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు పాల్గొన్నారు.

Delete Edit

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి, సమస్యలు సృష్టించింది. వీటిని అధిక మించేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌కు తోడ్పాటును అందిస్తోంది. అందులో భాగంగా ఆర్థిక సహాయం అందిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్యాకేజీ వచ్చేలా చేశామని గవర్నర్‌ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నినాదంతో కూడిన స్వర్ణాంధ్ర విజన్‌ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెల్లడించారు. విజన్‌లో పొందుపరచిన పది సూత్రాలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News