కందుకూరు ఖిల్లాపై ఎగిరేజెండా ఎవరిది?

ఏపీలోని.. నెల్లూరు జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజక వర్గంపై ఏ పార్టీ జెండా ఎగురుతుంది. ఈ ఖిల్లాను దక్కించుకునే నాయకుడెవరు?

Update: 2024-04-05 13:23 GMT
Inturi Nageswararao tdp, Burra Madhusudhan ysrcp

కందుకూరు అసెంబ్లీ నియోజక వర్గం రెడ్డి.. కమ్మ సామాజిక వర్గాల మధ్య పోరుకు అడ్డా. ఏళ్ల తరబడి ఈ రెండు సామాజిక వర్గాల మ«ధ్యే పోరు సాగింది. ఒకరిపై ఒకరు గెలుస్తూ వచ్చారు. కమ్మ సామాజిక వర్గం నుంచి దివి కుటుంబం.. రెడ్డి సామాజిక వర్గం నుంచి మానుగుంట కుటుంబం ఏలుతూ వచ్చాయి. అయితే మధ్యలో ఇది తారుమారైంది. బయట నుంచి మరొక ఫ్యామిలీ వచ్చింది. 2014లో పోతుల రామారావు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లారు. తిరిగి మానుగుంట కుటుంబం నుంచి మహీధర్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున రంగంలోకి దిగి పోతుల రామారావును ఓడించారు.

రాజకీయాలకు దూరమైన పెత్తందారు కుటుంబాలు..
2024 ఎన్నికల్లో పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. అటు మానుగుంట కుటుంబానికి వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌ ఇవ్వ లేదు. ఇటు దివి శివరామ్‌ కుటుంబం రాజకీయానికి దూరంగా ఉంది. శివరామ్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తడం.. సమర్థవంతంగా రాజకీయాలు నడిపించే వ్యక్తి ఆ కుటుంబంలో లేక పోవడంతో తెలుగుదేశం పార్టీ మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. మొదటి నుంచి దివి శివరామ్‌ శిష్యుడిగా ఉన్న ఇంటూరి నాగేశ్వరావు టీడీపీ టిక్కెట్‌ దక్కించుకున్నారు. దీంతో ఆయన యాక్టివ్‌ రాజకీయాలవైపు నాగేశ్వరావు అడుగులు వేశారు. అయితే శివరామ్‌ మొదట నాగేశ్వరావును కాకుండా ఇంటూరి రాజేష్ ను దగ్గరకు తీసి ముందుగా చంద్రబాబుకు పరిచయం చేశారు. ఎందుకో శివరామ్‌తో రాజేష్ కు బెడవడంతో నాగేశ్వరరావుకు టిక్కెట్‌ ఇస్తే బాగుంటుందని చంద్రబాబుకు రెకమెండ్‌ చేశాడు శివరామ్‌. దీంతో శివరామ్‌ మాటలకు వ్యాల్యూ ఇచ్చిన చంద్రబాబు నాగేశ్వరరావుకు అవకాశం కల్పించారు. మొదట ఇన్‌చార్జ్‌గా ఉన్న రాజేష్ ప్రస్తుతం నాగేశ్వరావుకు వ్యతిరేకంగా గ్రూపు ఏర్పాటు చేసి ముందడుగు వేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి.
పట్టీపట్టనట్లు పోతుల రామారావు
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుల రామారావు మాత్రం యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రాకుండా సీటు ఇస్తే పోటీ చేయాలని ఆలోచించారు. చంద్రబాబు పోతులకు సీటు ఇవ్వలేదు. పార్టీ వారు కానీ, బంధువులు కానీ శుభకార్యాలకు పిలిస్తే వచ్చి వెళుతున్నారు. దీంతో పోతుల రామారావు టీడీపీలోనే ఉన్నప్పటికీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. పార్టీ వారు పిలిస్తే వెళ్లడం, లేకుంటే తన పని తాను చూసుకోవడం చేస్తున్నారు.
కనిగిరి నుంచి కందుకూరు పాలిటిక్స్‌లోకి..
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కనిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే. కనిగిరి నుంచి కందుకూరుకు జగన్‌ మధుసూదన్‌ను రాజకీయ బదిలీ చేశారు. దీంతో మధుసూదన్‌ కందుకూరులో గెలుపుకోసం తన వర్గాన్ని కూడగట్టుకుని ముందుకు సాగుతున్నారు. కందుకూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డికి సీటు దక్కకపోవడంతో బుర్రాతో కాస్త ఎడమొఖం, పెడమొఖంగంగానే ఉన్నారు. బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ మొదట 2019లో కందుకూరు టిక్కట్‌ కోసం ప్రయత్నించి విఫలమై కనిగిరిలో సీటు దక్కించుకుని గెలుపొందారు. తిరిగి 2024 ఎన్నికల్లో బుర్రాకు కందుకూరు వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ కేటాయించడంతో ముందుకు కొంత వెనక్కి తగ్గినా తిరిగి పోరు బాటలో ముందుకు సాగుతున్నారు.
మహీధర్‌ మద్దతు దక్కుతుందా?
మానుగుంట మహీధర్‌రెడ్డి మద్దతు కోసం బుర్రా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా మద్దతు కూడగడితే తప్పకుండా గెలుపు సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు. సామాజిక వర్గాల పరంగా చూసినా యాదవ, రెడ్డి సమాజిక వర్గాలు ఒక్కటైతే తప్పకుండా కమ్మ సామాజికవర్గంపై విజయం సాధించవ్చనే ఆలోనలో ఉన్నారు. అయితే బుర్రా ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా అనేది తేలాల్సి ఉంది. బహిరంగంగా మహీధర్‌రెడ్డి బుర్రాకు మద్దతు ప్రకటించలేదు. అనుచరులను మాత్రం టీడీపీ వైపుకు వెళ్లొద్దని హెచ్చరించారు. దీంతో మహీధర్‌రెడ్డ మద్దతు తనకే ఉంటుందనే ఆశలో మధుసూదన్‌ ఉన్నారు. మధుసూదన్‌ అమ్మమ్మ ఊరు కంచరగుంట. స్థానికంగా కూడా ఒక విధంగా బుర్రాకు కలిసొచ్చింది. దీంతో విజయం నన్ను వరిస్తుందనే ధీమాలో ఉన్నారు.
నాలుగు సామాజిక వర్గాల ఓట్లు కీలకం.
కందుకూరు నియోజకవర్గంలో సామాజిక వర్గాలను పరిశీలిస్తే కమ్మ సామాజిక వర్గం ఓట్లు సుమారు 46వేల వకు ఉన్నాయి. యాదవులు 30వేల వరకు ఉన్నారు. ఎస్సీల ఓట్లు సుమారు 45వేల వరకు ఉన్నాయి. ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. కమ్మ సామాజిక వర్గం ఓట్లు పూర్తిగా తనకు వస్తాయనే ధీమాను నాగేశ్వరావు వ్యక్తం చేస్తుంటే యాదవుల ఓట్లు పూర్తిగా నాకే వస్తాయనే ధీమాలో బుర్రా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా సుమారు 20వేల వరకు ఉన్నాయి. యాదవ, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లతో తాను తప్పకుండా గెలిచి తీరుతాననే ధీమాలో బుర్రా ఉండగా, కమ్మ, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు తనకు తప్పకుండా వస్తాయని, మిగిలిన కులాల వారి ఓట్లు కలుపుకుని గెలుపు సాధిస్తాననే ధీమాలో నాగేశ్వరావు ఉన్నారు.
Tags:    

Similar News