ఉచిత విద్యుత్ కంటే సోలార్ విద్యుతే ప్రభుత్వాలకు ఎక్కువ లాభమా?

200 యూనిట్ల ఉచిత విద్యుత్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు

Update: 2025-11-23 07:21 GMT
రూఫ్ టాప్ సోలార్

శ్రీష. హెచ్ ఆర్

గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సులో భారత్ లో సంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించి, శిలాజేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తుందని, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది. 2070 నాటికి కర్భన ఉద్గారాలను సున్న స్థాయికి చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
గ్లోబల్ వార్మింగ్ ఎదుర్కోవాలనే లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో కీలకమైన విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువగా సౌరశక్తిని ఉపయోగించడం ముఖ్యమైనది.
అయితే ఇందులో రాష్ట్రాలు, కేంద్రాలు చెరోదారి అనుసరిస్తున్నాయి. స్వల్పకాల లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కర్బన ఉద్గారాల తగ్గింపు అనే తమ సహజ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి.
కర్ణాటక ప్రయాణం..
పీఎం సూర్య ఘర్ మఫ్ట్ బిజిలీ యోజన కింద 3 కిలోవాట్ల వరకూ ఇంటిపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 78 వేల వరకూ సబ్సీడీ అందిస్తుంది. నెలకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ను పొందెలా వినియోగదారులను ప్రొత్సహించడం ఈ పథకం లక్ష్యం. అయితే ఉచిత విద్యుత్ ను ఒక వినియోగదారుడు పొందాలంటే తన జేబు నుంచి దాదాపు రూ. 1.47 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పథకానికి మొత్తానికి దాదాపు రూ. 2.25 లక్షలు ఖర్చు అవుతుంది.
సంస్థాపనకు మిగిలిన మొత్తాన్ని చెల్లించడం చాలామంది వినియోగదారులకు ఆసక్తి కలిగించట్లేదు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనితో సౌర విద్యుత్ పథకానికి ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. మరో వైపు ప్రభుత్వం గృహజ్యోతి కింద సంవత్సరానికి దాదాపు రూ.10,100 కోట్ల భారాన్ని భరిస్తోంది.
అనిశ్చిత ఆర్థిక పరిస్థితి..
రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఎంతకాలం కొనసాగించగలదో క్లారిటీ లేదు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంది. సిద్ధారామయ్య సర్కార్ ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేయడానికి అప్పులు చేస్తోంది. ఇవి క్రమంగా తడిసి మోపెడు అవుతున్నాయి.
రూఫ్ టాప్ సోలార్ కింద సెంట్రల్ స్కీమ్ ను ఎవరైన వినియోగదారుడు కావాలనుకుంటే ముందుగా జాతీయ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి. తరువాత సోలార్ ఏజెన్సీల జాబితా కనిపిస్తుంది.
దాంట్లో వినియోగదారుడు ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వారి వాటా డబ్బును చెల్లించిన తరువాత ఇన్ స్టాలేషన్ చేస్తారు. తరువాత సబ్సిడీ మొత్తం వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. దీనికి మధ్యవర్తి ఎవరూ ఉండరు.
3 కిలో వాట్ల రూఫ్ టాప్ సోలార్ సెటప్ కోసం రూ. 78 వేల సబ్సిడీ నేరుగా వినియోగదారుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 1 కోటీ గృహాలకు మద్దతు ఇవ్వడానికి రూ. 75 వేల కోట్లను ఖర్చు చేయాలని యోచిస్తోంది.
సాధారణంగా ఒక ఇంటికి 2 కిలోవాట్ల విద్యుత్ మాత్రమే అవసరం ఉండగా, కానీ సబ్సీడీ 3 కిలోవాట్ల వరకూ ఉంటుంది. ప్రజలు దానిని ఇష్టపడే అవకాశం ఉంది. సౌర ఫలకాలు దాదాపు 25 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు పెట్టిన పెట్టుబడి కాలక్రమేణా తిరిగి రిటర్న్ అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ పథకాలు అమలు చేస్తే సౌర శక్తి పథకం విజయవంతం అవుతుంది. రాష్ట్రం కూడా కేంద్రంతో కలిసి రూ. 78 వేలు సబ్సిడీ ఇస్తే వినియోగదారుడు కూడా అంతే మొత్తం భరించాల్సి ఉంటుంది. దీనితో ఖజానాపై భారం తగ్గుతుంది.
ఉత్పత్తి చేసిన విద్యుత్ ద్వారా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి రెండేళ్ల లోపు తిరిగి వస్తుంది. అంటే మూడు కిలో వాట్ల విద్యుత్ లో రెండు కిలో వాట్లు ఇంటికి, ఒక యూనిట్ ప్రభుత్వం వాడుకోవాలి. ఇది ఉభయతారకం.
అయితే ప్రజలకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇది విద్యుత్ దుర్వినియోగానికి దారితీస్తుంది. రూప్ టాప్ సోలార్ ను ఉపయోగించడం ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోడెద్దుల బండి లాంటివి. రెండు కలిసి నడిస్తేనే అన్ని సఫలం అవుతాయి. లేకపోతే వృద్ది అక్కడే ఆగిపోతుంది.
దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి..
దేశంలో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ రంగంలో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. 23 గిగా వాట్లతో రాజస్థాన్ మొదటి స్థానంలో ఆక్రమించగా, 10.13 గిగావాట్లతో గుజరాత్, 9.05 మెగావాట్లతో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. కర్ణాటకలోని పావగడ వద్ద అతిపెద్ద సోలార్ పార్క్ ఉంది.
ఇక్కడ 2 వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంతపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ దేశంలో ఎక్కడా లేదు. 2030 నాటికి దేశంలో సౌరశక్తి ద్వారా 292 గిగావాట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
భవిష్యత్ లో దేశీయ విద్యుత్ అవసరాలలో సౌర, పవన శక్తి ద్వారా 50 శాతం సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే బొగ్గు వినియోగం దాదాపు 50 శాతం మేరకు తగ్గుతుంది. కర్ణాటక ఇప్పటికే తన విద్యుత్ అవసరాలలో 50 శాతం సౌరశక్తి ద్వారానే తీర్చుకుంటోంది.
విద్యుత్ పంపిణీ వ్యవస్థలు..
విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇప్పుడు సమస్య కాదు. సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థను రూపొందించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. కేంద్ర ప్రభుత్వం కుసుమ్- సీ పథకం కింద, సౌర విద్యుత్ కోసం ప్రత్యేక గ్రిడ్ ను నిర్మించడానికి పూనుకుంది.
ఇది కర్ణాటకకు గొప్పవరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న విద్యుత్ లైన్ల వద్ద మరిన్ని సౌర శక్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తే విద్యుత్ ను సులభంగా సరఫరా చేయవచ్చు. సౌర విద్యుత్ కేవలం పగలు మాత్రమే ఉత్పత్తి అవుతుంది కాబట్టి, సూర్యాస్తమయం తరువాత గ్రిడ్ ను కాపాడుకోవాలంటే ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులు సిద్దంగా ఉంచుకోవాలి.
పంప్డ్ స్టోరేజీ
ఈ సమస్యను పరిష్కరించడానికి ‘పంప్డ్ స్టోరేజీ’ని ఒక పరిష్కారంగా చెప్పవచ్చు. పంప్డ్ స్టోరేజీ అనేది శక్తిని నిల్వ చేయడానికి ముఖ్యంగా జలవిద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఒక భాగం.
శరావతి వ్యాలీ ప్రాజెక్ట్ ఈ విధంగా 2 వేల మెగావాట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ కు కొన్ని పర్యావరణ సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో కూడా పంప్డ్ స్టోరేజీని వాడుకునే ఆలోచనలు ఉన్నాయి.
సౌర విద్యుత్ పెరిగే కొలది గ్రిడ్ ను సైతం అప్ గ్రేడ్ చేయాలి. లేకుండా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ ను వాడుకోలేము. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు రేట్లు క్రమంగా తగ్గుతున్నాయి. బహిరంగ మార్కెట్ లో సౌర విద్యుత్ యూనిట్ కు రూ. 2.50 మాత్రమే ఖర్చవుతుంది. అందువల్ల ప్రసార, నిల్వను మెరుగుపరుచుకోవడంలో ప్రాధాన్యం ఇవ్వాలి.
గ్రిడ్ పై ఒత్తిడి తగ్గించడానికి వినియోగదారులు స్వతంత్య్రంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడాన్ని ప్రొత్సహించాలి. ఇది గ్రిడ్ పై భారాన్ని తగ్గిస్తుంది.
గ్రిడ్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తే 11 నుంచి 15 శాతం నష్టం జరుగుతోంది. ఇది వినియోగదారులకు భారంగా మారుతుంది. సోలార్ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
రూఫ్ టాప్ సోలార్ పలకాల విద్యుత్ ఉత్పత్తిలో 4,984 మెగావాట్లతో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర లో 3,304 మెగావాట్లు, రాజస్థాన్ 1,483 మెగావాట్లు, కర్ణాటక 683 మెగావాట్లతో తరువాత స్థానాలలో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు ఉచిత విద్యుత్ బదులు రూప్ టాఫ్ సోలార్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కర్ణాటక కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుంది.
భవిష్యత్ మొత్తం సౌర విద్యుత్ దే..
భారత్ లోని బంజరు భూమిలో కేవలం 3 శాతం ఉపయోగిస్తే సౌర శక్తి ఉత్పత్తి ద్వారా విద్యుత్ సమస్యను చాలా వరకూ పరిష్కరించుకోవచ్చు. రాజస్థాన్ కాకుండా దేశంలోని కర్ణాటకలోనే ఎక్కువ బంజరు భూమి ఉంది. విస్తీర్ణం పరంగా చూస్తే దాదాపు 13,536 చదరపు మీటర్లుగా ఉంది.
ఇది రాష్ట్ర విద్యుత్ అవసరాలలో దాదాపు 50 శాతం తీర్చగలదు. ప్రతి చదరపు మీటర్ కు రోజుకు 4- 7 కిలోవాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి అవుతుంది. దీనిని సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి అడుగేస్తేనే నిజమైన పురోగతి సాధ్యం.
Tags:    

Similar News