ట్రాన్స్ జెండర్ల మధ్య గొడవలో ఇద్దరు మృతి

దెబ్బలుతిన్న గ్రూపు సభ్యులతో పాటు వాళ్ళకు మద్దతుగా మరికొందరు శనివారం నగరంలోని బోరబండ జంక్షన్లో ధర్నాచేశారు

Update: 2025-11-23 06:47 GMT
Clashes among transgenders in Hyderabad

ఆధిపత్య పోరాటాలు మామూలు వ్యక్తుల మధ్యే కాదు ట్రాన్స్ జెండర్ల మధ్య కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాదులో ట్రాన్స్ జెండర్ల(Transgenders) మధ్య జరిగిన గొడవలో ఇద్దరు మరణించారు. విషయం ఏమిటంటే ఒక బర్త్ డే పార్టీలో రెండు ట్రాన్స్ జెండర్ల గ్రూపుల మధ్య గొడవైంది. ఆ గొడవలో రెండుగ్రూపుల్లోని ట్రాన్స్ జెండర్లు బాగా కొట్టుకున్నారు. కొంతమంది జోక్యంచేసుకుని గొడవను సర్దుబాటుచేశారు. తర్వాత రెండు గ్రూపుల్లోని సభ్యులు తమ లీడర్ మోనాలిసా దగ్గరకు పంచాయితీ చేయమని వెళ్ళారు.

రెండు గ్రూపుల వాదనలు విన్న మోనాలిసా ఒక గ్రూపులోని సభ్యులను బాగాతిట్టి కొట్టింది. దాంతో దెబ్బలుతిన్న గ్రూపు సభ్యులతో పాటు వాళ్ళకు మద్దతుగా మరికొందరు శనివారం నగరంలోని బోరబండ జంక్షన్లో ధర్నాచేశారు. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని గ్రూపుసభ్యులను నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే గ్రూపుసభ్యులు వినకుండా ఆందోళనను మరింత ఎక్కువచేశారు. దాంతో గ్రూపును చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ నేపధ్యంలో గ్రూపుసభ్యుల్లోని ఇద్దరు అప్సర, హీనా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. దాంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఇద్దరినీ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతు అప్సర అదేరోజు మరణించగా హీనా ఆదివారం తెల్లవారుజామున మరణించింది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

ఒకవైపు ట్రాన్స్ జెండర్లకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలని పోలీసులు ప్రయత్నిస్తుంటే మరోవైపు చాలామంది గొడవల్లో ఇరుక్కుంటున్నారు. నగరంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా సుమారు 30 మంది ట్రాన్స్ జెండర్లకు శిక్షణిచ్చి నగర పోలీసు కమిషనర్ వివిధ ప్రాంతాల్లో నియమించిన విషయం తెలిసిందే. ట్రాన్స్ జెండర్ల ఆగడాలపై చాలామంది నుండి పోలీసులకు అనేక ఫిర్యాదులు అందుతునే ఉన్నాయి. వీళ్ళు ఇతరులను అనేకరకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా చివరకు తమలో తాము ఆధిపత్యం కోసం గొడవలుపడి చివరకు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.

Tags:    

Similar News