మదీనాలో బస్సు ప్రమాదంలో 45 మంది షహీదులయ్యారు
మదీనా బస్సు ప్రమాదంలో మృతులకు పవిత్ర మదీనాలోని జన్నతుల్ బఖీలో శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి.
సౌదీఅరేబియా దేశానికి ఉమ్రా యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలకు శనివారం మధ్యాహ్నం మదీనాలోని జన్నతుల్ బఖీలో అంత్యక్రియలు చేశారు. మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ముందుగా ప్రార్థనల కోసం ప్రవక్త మసీదుకు తీసుకువచ్చారు.
మరణించిన ముస్లింల కోసం ఇస్లామిక్ పద్ధతిలో అంత్యక్రియల ప్రార్థన అయిన సలాత్ అల్-జనాజా నమాజ్ చదివారు. ప్రవక్త మసీదు వెలుపల మదీనా ప్రమాద బాధితులను తీసుకువెళుతుండగా బంధువులు ఆలింగనం చేసుకున్నారు.మదీనా ప్రమాద బాధితుల బంధువులు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. మదీనాలోని ప్రవక్త పేరిట ఉన్న మసీదులో ధుహ్ర్ తర్వాత షేక్ అబ్దుల్ బారి అల్-తుబైతి నేతృత్వంలో అంత్యక్రియల ప్రార్థన జరిగింది. ప్రార్థన తర్వాత, ఇస్లాంలో అత్యంత పవిత్రమైన శ్మశానవాటికలలో ఒకటైన జన్నతుల్ బాఖీలో ఖననం చేశారు. ఇదే శ్మశానవాటికలో గతంలో ప్రవక్త ముహమ్మద్ సహచరులు, కుటుంబసభ్యులు చాలా మందిని ఖననం చేశారు.
మదీనా బస్సు ప్రమాదం
మృతులంతా హైదరాబాదీలే...
Aj Masjid e Nabawi me Makkah-Madinah Highway Sadak Hadesa ke tamaam Marhoomeen jo Hyderabad se talluq rakhte the unke saari karwayyo ke baad unki tadfeen ka aaqri marhala amal me aya pic.twitter.com/mLn97dnBT0
— Majid Hussain (@Md_MajidHussain) November 22, 2025
ఈ దుర్ఘటన మృతుల కుటుంబసభ్యుల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మదీనాలోని జన్నతుల్ బఖీలో పవిత్ర స్థలంలో అంత్యక్రియలు జరుగడంతో, 45 మంది ఉమ్రా యాత్రికుల ఆత్మలకు సకాలంలో విశ్రాంతి లభించింది. ఈ విషాద ఘటన ప్రతి హృదయాన్ని కదిలించింది.వారి ఆత్మలు ఇప్పుడు మదీనాలోని పురాతన జన్నతుల్ బఖీలో శాంతిగా ఖననం చేశారు.
జన్నతుల్ బాఖీ ఎందుకు ముఖ్యమైనది
ప్రార్థన తర్వాత ప్రవక్త మసీదులో అంత్యక్రియల ప్రార్థనలు (సలాత్ అల్-జనాజా) నిర్వహిస్తారు. ఇస్లాం యొక్క అతి ముఖ్యమైన శ్మశాన వాటికల్లో జన్నతుల్ బఖి ఒకటి. ఇందులో ప్రవక్త ముహమ్మద్ కుటుంబ సభ్యులు,అనేక మంది ఆయన సహచరుల సమాధులు ఉన్నాయి.
సకల అదృష్టానికి ప్రతీక: సౌదీలోనే ఖననం
సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం హజ్ లేదా ఉమ్రా యాత్రలో మక్కా, మదీనా వంటి పవిత్ర నగరాల్లో మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి పంపరు. అక్కడి ఇస్లామిక్ ఆచారాల ప్రకారం సౌదీలోనే ఖననం చేస్తారు. ఈ నియమం చాలా మందికి కఠినంగా అనిపించినా, ముస్లింలు దీనిని అదృష్టంగా భావిస్తారు. జన్నత్-ఉల్-బఖి లేదా జన్నత్-ఉల్-ముఅల్లా వంటి పవిత్ర శ్మశానవాటికల్లో సమాధి కావడాన్ని గొప్ప భాగ్యంగా పరిగణిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సహచరులు ఖననం చేయబడిన చోట విశ్రమించడం కన్నా, ఒక విశ్వాసికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుందని ఇస్లామిక్ పండితుడు హైదరాబాద్ కుచెందిన అజీజుర్ రహమాన్ వ్యాఖ్యానించారు.
అమరవీరుల హోదా: ఇస్లాం వాగ్దానం
హజ్ లేదా ఉమ్రా సమయంలో మరణిస్తే స్వర్గం లభిస్తుందనే నమ్మకానికి ఇస్లామిక్ ధర్మశాస్త్రంలో బలమైన ఆధారం ఉంది. ఇస్లామిక్ పండితులు మరియు హదీసులు (ప్రవక్త బోధనలు) ఈ విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తున్నాయని ఇస్లామిక్ రచయిత ముహ్మద్ ముజాహిద్ చెప్పారు. షహీద్ (అమరుడి) స్థానం: ఇస్లామిక్ హదీసుల ప్రకారం‘‘ఎవరైతే హజ్ సమయంలో లేదా ఉమ్రా సమయంలో మరణిస్తారో, వారు అమరుడి (షహీద్) హోదాను పొందుతారు." అంటే, వారు దేవుడి మార్గంలో ప్రాణాలర్పించిన వారి స్థానాన్ని పొందుతారు. ఇది వారి పాపాలను క్షమించి, నేరుగా స్వర్గానికి ప్రవేశించే మార్గాన్ని సుగమం చేస్తుంది’’అని ముజాహిద్ వివరించారు.