మోదీ సాబ్, ఏపీలో మీ పోరు ఏ పార్టీమీదో చెప్తారా లేక సారీ అంటారా!

కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ప్రధాని మోదీకి నాలుగు సూటి ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదా, పోలవరానికి నిధుల నిలిపివేతపై సారీ చెప్తారా లేక వాటిని ఇస్తారా..;

Update: 2024-03-17 08:59 GMT
జైరామ్ రమేశ్, నరేంద్ర మోదీ (గ్రాఫిక్స్)

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి రాష్ట్రంలో పర్యటించాలనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాపై బీజేపీ వైఖరేమిటో చెప్పాలని నిలదీశారు. వైఎస్ జగన్ తో ఉన్న రహస్య ఒప్పందమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో చెప్పాలన్నారు. ప్రస్తుతం జైరాం రమేశ్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ మేధావివర్గంలో చర్చనీయాంశంగా మారింది.

జైరామ్ రమేశ్ ఏమన్నారంటే..

దేశ ప్రధాని నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ఇంతకుముందు మాదిరిగా అధికారిక పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టం. మీ సరదా తీర్చుకునే వీలులేదు. అందుకు బదులుగా మీరిప్పుడు రెండో ప్రత్యామ్నాయ కార్యక్రమల్లో పాల్గొంటారు. అదే ప్రధాని *‘3డి’* ప్రచార కార్యక్రం. అవి ఏమిటో అందరికి తెలిసినవే. అవే ప్రజల దృష్టిని మళ్లించడం; వాస్తవాలను వక్రీకరించడం, పురువు నష్టం కలిగించడం.

అయితే, మీరిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజానీకం ఈ క్రింద లేవనెత్తుతున్న కీలక ప్రశ్నలకు మీరు మీ ప్రసంగంలో సమాధానం ఇస్తారని ఆశిస్తున్నా!


నాలుగు ప్రశ్నలకు జవాబు చెప్పిరండి ప్లీజ్..

  1. ఫిబ్రవరి 20, 2014న నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్ల పాటు ప్రత్యేకహోదాకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ సమయంలో బీజేపీ అగ్రనేత ఎం. వెంకయ్య నాయుడు వెంటనే లేచి *‘‘ఐదేళ్లు దేనికి? బీజేపీ అధికారంలోకి వచ్చాక 10 ఏళ్లు ఇస్తాం’’* అని ప్రకటించారు. 10 ఏళ్లు గడిచాయి. ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ అంశంలో నరేంద్రమోదీ ఆంధ్ర ప్రజలకు ఏం చెబుతారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో ఆయన వైఖరి ఏమిటి?
  2. ఒకవైపు బీజేపీ అధికారికంగా టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. రెండోవైపు అనధికారంగా వైఎస్సాఆర్‌సీపీతో అంటకాగుతోంది. ఇందుకు ఉదాహరణ - వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై సిబిఐ పెట్టిన అక్రమార్జన కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, అలాగే మోదీ ప్రభుత్వానికి ఇంతకాలం పార్లమెంట్‌లో అన్ని బిల్లులకు వైఎస్సాఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం. ఇంతకీ నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లో తమ నిజమైన రాజకీయ ప్రత్యర్ధి ఎవరో వివరణ ఇస్తారా?
  3. ఫిబ్రవరి 2019లో గుంటూరులో పర్యటించినపుడు ప్రధాని నరేంద్రమోదీ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. రాజకీయంగా పిల్లిమొగ్గలు వేయడంలోను, అవినీతికి పాల్పడ్డంలోను నాయుడు చాలా సీనియర్‌ అని ఎద్దేవా చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని ఏటిఎంల్లా మార్చుకొని సొంత సంపద పోగేసుకొన్నారని బాబును విమర్శించారు. మరి ఈ ఐదేళ్లల్లో ఏం మార్పు జరిగింది? చంద్రబాబు నిజాయితీపరుడిగా మారిపోయారా? లేదూ.. గత పదేళ్లల్లో ఎలక్టోరల్‌ బాండ్‌ స్కామ్‌ల్లాంటి వాటిద్వారా దోచేసిన నరేంద్రమోదీ తన భాగస్వామ్య పక్షాల పట్ల అనుసరించే ప్రమాణాలను మార్చుకొన్నారా?
  4. 2004లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి కుడి, ఎడమ కాల్వలతో సహా ప్రాజెక్టులో 1/3 వంతు పనుల్ని 2014 నాటికల్లా పూర్తి చేసింది. ఆ తర్వాత, కడచిన 10 ఏళ్లల్లో కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న రెండు ప్రభుత్వాల వంచన వల్ల (మొదటి 5 ఏళ్లు టీడీపీ, రెండో ఐదేళ్లు వైఎస్సాఆర్‌సీపీలతో ఉన్న అధికార, అనధికార పొత్తులతో) పోలవరం పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు ఎందుకు నత్తనడక నడుస్తున్నదో ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పగలరా?

ఈ ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాబులు చెప్పాలని, లేకుంటే పశ్చాత్తాపం వ్యక్తంచేయాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు ఏపీ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ జైరామ్ రమేశ్ ట్వీట్ ను జతపరిచి ప్రకటనలు విడుదల చేశారు.

Tags:    

Similar News