డీజీపీ రామచంద్రరావుపై దర్యాప్తుకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వం
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రన్యారావు, డీజీపీకి వరుసకు కూతురు కావడంతో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం;
By : The Federal
Update: 2025-03-11 13:15 GMT
బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటీ రన్యారావు కేసు కీలక మలుపు తిరిగింది. రన్యారావు డీజీపీ రామచంద్రారావు వరుసకు కూతురు కావడంతో విమానాశ్రయాల్లో వీఐపీ సేవలు ఉపయోగించుకుంటోందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఇందులో ఆయన పాత్ర ఏదైనా ఉంటే దాని దర్యాప్తు చేయడానికి అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను నియమించింది. గుప్తా నియమాకాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం మీడియాకు తెలియజేసింది.
రామచంద్రారావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. బెంగళూర్ లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రాయంలో రన్యారావు నుంచి రూ. 12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు.
ఆ తరువాత ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. ఇందులో రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2.67 కోట్ల విలువైన భారతీయ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాలు..
‘‘ప్రోటోకాల్ సంబంధిత సౌకర్యాలను పొందటానికి దారితీసిన వాస్తవాలు, పరిస్థితులను ఈ కేసులో కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌజింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రరావు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్, ఐపీఎస్ కేడర్ పాత్రను పరిశోధించడానికి ఏసీఎస్ గౌరవ్ గుప్తాను దర్యాప్తు అధికారిగా నియమించారు’’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దర్యాప్తు అధికారి వెంటనే విచారణ ప్రారంభించి, ఒక వారంలోపు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఈ దర్యాప్తుకు అవసరమైన అన్ని పత్రాలు, సాయాన్ని అందించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కార్యదర్శి, సిబ్బంది, పరిపాలనా సంస్కరణల విభాగం కూడా ఆదేశించింది.
‘‘దుబాయ్ నుంచి బెంగళూర్ కు అక్రమంగా బంగారు కడ్డీలను రవాణా చేస్తున్నప్పుడూ సినీ నటీ రన్యారావును డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అరెస్ట్ చేసిందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
వీఐపీ సేవలు..
వీఐపీ సేవలు పొందుతూ విమానాశ్రాయాల్లో ఉన్నత స్థాయి అధికారులను మన్ననలు పొందుతూ వాటిని దుర్వినియోగం చేశాడని మీడియాలో వార్తలు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది.
‘‘కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌజింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఆమె తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ అందించిన ప్రోటోకాల్ సేవలను రన్య దుర్వినియోగం చేసిందని, విమానాశ్రాయాల్లో తనిఖీలను తప్పించుకోవడానికి డీజీపీ పేరు, చిరునామాను ఉపయోగించారని దీనిపై విచారణ చేయండని ప్రభుత్వం ఆదేశిస్తుంది’’ అని ఉత్తర్వూల్లో పేర్కొన్నారు.
సీఐడీ దర్యాప్తు..
పోలీస్ సిబ్బంది ప్రమేయం పై దర్యాప్తు చేయడానికి క్రిమినల్ ఇన్వేస్టిగేషన్ డిపార్ట్ మెంట్ మరో దర్యాప్తు నిర్వహించనుందని సమాచారం. విమానాశ్రాయాల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై దర్యాప్తు చేసే బాధ్యతను సీఐడీ కి అప్పగించారు. పోలీస్ అధికారులు సరైన తనిఖీలు రన్యా రావును భద్రతా తనిఖీ కేంద్రాల ద్వారా తీసుకెళ్లారా లేదా అనేది సీఐడీ విచారణలో తేలుతుంది.