మహిళలకు మోదీ క్షమాపణ చెప్పాలి: రాహూల్ గాంధీ

రేపిస్టు ఎంపీ తరఫున ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశ ఎంపీలను క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీ డిమాండ్ చేశారు.

Update: 2024-05-02 10:38 GMT

హసన్, జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళలపై అత్యాచారం చేశారని, ఆ దాడుల వీడియోలను రికార్డ్ చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం (ఏప్రిల్ 2) ఆరోపించారు. ఎన్నికల్లో రేవణ్ణను సమర్థించినందుకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కర్నాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహూల్ ప్రసంగిస్తూ, మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ రేపిస్టును సమర్ధించి ఓట్లు అడిగినందుకు దేశంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. 33 ఏళ్ల ఎంపీకి సంబంధించిన అనేక స్పష్టమైన వీడియో క్లిప్‌లు ఇటీవలి రోజుల్లో హాసన్‌లో హల్‌చల్ చేయడం ప్రారంభించాయి. దీనిపై రాహూల్ గాంధీ స్పందించారు.
ఏప్రిల్ 26 న కర్నాటకలో జరిగిన మొదటి దశ పోలింగ్ రోజు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వచ్చాయి.
“ప్రధానమంత్రి భారతదేశపు తల్లులు, సోదరీమణులకు కూడా క్షమాపణలు చెప్పాలి. ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళలపై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. ఇది సెక్స్ స్కాండల్ కాదు సామూహిక అత్యాచారం' అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఆరోపించారు.
‘‘కన్నడ వేదికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి ప్రధాని మద్దతు పలికారు. మీరు ఈ రేపిస్ట్‌కు ఓటు వేస్తే అది నాకు సాయం చేస్తుంది అని ఆయన (మోదీ) కర్ణాటకకు చెప్పారు, ”అని గాంధీ ఆరోపించారు. అతడో సామూహిక రేపిస్టు అని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఓటు వేయాలని కోరారని రాహూల్ గాంధీ విమర్శించారు.
“ప్రధానమంత్రి భారతదేశంలోని ప్రతి మహిళను అవమానించారు. పీఎం, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలందరూ దేశంలోని ప్రతి మహిళకు క్షమాపణలు చెప్పాలి’’ అని, ‘‘సామూహిక రేపిస్టు’’ కోసం ప్రపంచంలో ఏ నాయకుడూ ఓట్లు అడగలేదని ఆరోపించారు.
“ప్రధానమంత్రి ఒక సామూహిక రేపిస్ట్‌కు ఓట్లు అభ్యర్థించడం ప్రపంచవ్యాప్తంగా వార్త. ఇదీ బీజేపీ సిద్ధాంతం. పొత్తులు పెట్టుకోవడానికి, అధికారం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని రాహూల్ గాంధీ మండిపడ్డారు.
Tags:    

Similar News