కేంద్రం తీరుకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు..

బడ్జెట్‌ కేటాయింపులో కేంద్రం తమిళనాడు పట్ల సవతి తల్లి ప్రేమ చూపిందని తమిళనాడు క్యాబినెట్ ఆరోపిస్తుంది.

Update: 2024-07-25 11:37 GMT

బడ్జెట్‌ కేటాయింపులో కేంద్రం తమిళనాడు పట్ల సవతి తల్లి ప్రేమ చూపిందని తమిళనాడు క్యాబినెట్ ఆరోపిస్తుంది. ఈ అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఆందోళనలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.

కొన్ని రాష్ట్రాలకు ఉదారంగా నిధులు కేటాయించారని, మెట్రో రైల్, వరద సహాయం కోసం ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చేసిన విజ్ఞప్తిని పూర్తిగా విస్మరించారని పార్టీ నేతలు అంటున్నారు. బడ్జెట్ కేటాయింపులు అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని చేయాలని, అన్నింటిని సమదృష్టితో చూడాలని కోరింది.

"కానీ ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించినట్లు లేదు. వారిని (బిజెపి) కాపాడే రాష్ట్రాలను ఎంపిక చేసుకుని వాటికే నిధులు కేటాయించడం అన్యాయమని’’ డీఎంకే ప్రకటన విడుదల చేసింది. 

Tags:    

Similar News