జైళ్ల నుంచి ‘రామేశ్వరం కెఫె’ పేలుళ్ల కుట్ర ?

రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడుకు కుట్ర జైళ్ల నుంచే జరిగిందా? జాతీయ దర్యాప్తు సంస్థ జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను ఎందుకు విచారిస్తోంది. దీనిపై ఏం తేలింది.

Update: 2024-03-06 11:40 GMT

బెంగళూర్ బాంబు పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ను వేగవంతం చేసింది. అయితే తాజాగా కర్నాటక జైళ్ల శాఖలో ఉన్న కొంతమంది ఖైదీలు దీనికి ప్రణాళికలు వేసినట్లు అనుమానం రావడంతో ఆ వైపుగా దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న చిన్న నేరాలు చేసి శిక్ష పడిన ఒక వర్గం యువతను జైళ్లలో టార్గెట్ చేసి ఉగ్రవాద సానుభూతి పరులుగా మారుస్తారని గత కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి.

వారిలో కొంతమందిని రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడులో ప్రమేయం ఉండవచ్చని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఈ పేలుడుతో పాటు మంగళూర్ లో జరిగిన పేలుడు, తమిళనాడు దగ్గర జరిగిన మరో పేలుడు ఘటనకు బాంబులు అమర్చిన దానికి పోలికలు ఏమైనా ఉన్నాయా అని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. 2008 లో బెంగళూర్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి, ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన వారితో కలిసి అక్కడే ఉగ్రవాదం నూరిపోసి రాడికల్ గా తయారు చేస్తున్నారని తెలుస్తోంది.

అరెస్ట్ అయిన బెయిల్ పొందిన వ్యక్తులు తరువాత ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో అసలు జైళ్లలో ఏం జరుగుతుందో అన్నదానిపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. వీరికి ఐబీ, సీసీబీ పోలీసులు కూడా సహకరిస్తున్నారు. కోర్టు అనుమతితో అక్కడ ఉన్న ఉగ్రవాదులను విచారించనున్నారు. అవసరమైతే తిరిగి కస్టడీకి తీసుకోవడానికి ఎన్ఐఏ సిద్ధంగా ఉంది.
బాంబు పోలికలు
ఫొరెన్సిక్ విశ్లేషణలు, బాంబు నిఫుణుల ప్రకారం రామేశ్వరం కెఫె పేలుడు, కోయంబత్తుర్ కారు పేలుడు, గత ఏడాది నవంబర్ లో జరిగిన మంగళూర్ కుక్కర్ పేలుడు లో సారూప్యతలు ఉన్నాయా అని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారికి బెంగళూర్ బాంబుపేలుడు ఘటనలో పరారీలో ఉన్న నిందితులకి, ప్రస్తుతం కస్టడీలో ఉన్నవారికి ఏమైన సంబంధం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే కర్నాటక, తమిళనాడు, కేరళలోని జైళ్లలో ఉన్న ఇతర ఉగ్రవాదులందరికి విచారిస్తున్నట్లు ఓ అధికారి ఫెడరల్ కు చెప్పారు.
వీరిలో 1998 కోయంబత్తూర్ బాంబు పేలుడుతో 58 మంది అమాయకులను చంపిన ప్రధాన నిందితుడు, అల్ ఉమ్మా వ్యవస్థాపకుడు ఎస్ ఏ బాష మేనల్లుడు మహ్మద్ తల్కా కూడా ఒకడు. అలాగే మంగళూర్ పేలుళ్ల నిందితులు మహ్మద్ షరీక్, సయ్యద్ యాసీన్లను కూడా ఎన్ఐఏ ప్రశ్నించనుంది. రామేశ్వరం పేలుళ్ల పై జాతీయ దర్యాప్తు సంస్థ చెన్నై, కడలూర్, మంగళూర్ లో సోదాలు నిర్వహించింది.
గతంలో ఎన్ఐఏ కేసుల్లో దోషులుగా తేలిన కొంతమంది ఉగ్రవాదులు ఇతర కేసుల్లో శిక్ష పడిన వారిని తమ వైపు తిప్పుకుని శిక్షణ ఇస్తున్నారు, వారే నేరాల్లో పాలుపంచుకుంటున్నారు. రామేశ్వరం కెఫెలో పేలుడు తరువాత ఎన్ఐఏ ఆరు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. కర్నాటకతో పాటు తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ లో దాడులు చేసి డిజిటల్ పరికరాలు, పత్రాలు, నగదు స్వాధీనం అయింది. అలాగే మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, నిల్వ పరికరాలు, నేరారోపణ పత్రాలు కూడా వశపరుచుకుంది.
బెంగళూర్ లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో లష్కర్ తోయిబా ఉగ్రవాదీ ఖైదీలపై తీవ్ర స్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డానికి కొన్ని వర్గాలు చెబుతున్నాయి. రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడు పై విచారణ చేస్తున్నామని సీఎం సిద్ధ రామయ్య చెప్పారు. "కొన్ని ఆధారాలు దొరికాయి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. " తదుపరి అన్ని అంశాలు తెలుస్తాయని చెప్పారు.
Tags:    

Similar News