కేంద్రం తీరుపై సుప్రీంలో పిటీషన్ వేసిన తమిళనాడు సీఎం..

జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదని తమకు సమగ్ర శిక్ష పథకం కింద రావాల్సిన నిధులను కేంద్రం ఆపేసిందని పిటీషన్‌లో పేర్కొన్న స్టాలిన్..;

Update: 2025-05-21 09:39 GMT
Click the Play button to listen to article

కేంద్రం తీరును తమిళనాడు(Tamil Nadu) సీఎం స్టాలిన్ (CM Stalin) అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర శిక్ష పథకం(Samagra Shiksha Scheme) కింద తమ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు (Education Fund) రూ.2,291కోట్లను నిలిపివేయడాన్ని తప్పుబడుతూ ఆయన సుప్రీం కోర్టు(Supreme Court)లో కేసు వేశారు. జాతీయ విద్యా విధానానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్ల నిధులు ఆపేశారన్నది స్టాలిన్ వాదన. వారి షరతు రాజ్యాంగ విరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిధుల విడుదల చేయకపోవడం వల్ల ఉపాధ్యాయుల జీతాలు, పాఠశాల మౌలిక సదుపాయాలు, ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు రవాణాకు ఇబ్బందిపడాల్సి వస్తుందని, ఈ ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా భరించడం వల్ల ఆర్థిక భారం మరింత పెరుగుతుందని పిటీషన్‌లో పేర్కొన్నారు.

2024-25 సంవత్సరానికి రూ.2,151.59 కోట్లు వెంటనే విడుదల చేయాలని, ఏప్రిల్ 2024 నుంచి 6 శాతం వడ్డీతో కలిపి మొత్తం రూ.2,291.30 కోట్లు విడుదల చేయాలని పిటీషన్‌లో డిమాండ్ చేశారు. కేంద్రం చర్యలు విద్యను ప్రాథమిక హక్కుగా హామీ ఇచ్చే ఆర్టికల్ 21, 21A, 45 ప్రకారం ఆర్టికల్స్ RTE చట్టాన్ని, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని తమిళనాడు పేర్కొంది. 

Tags:    

Similar News