ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు
పాపట్‌పల్లి–డోర్నకల్ మధ్య ట్రాక్ పనుల కారణంగా..;
పాపట్‌పల్లి–డోర్నకల్ మధ్య ట్రాక్ పనుల కారణంగా ఆగస్టు 14 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు రైళ్లు రద్దయ్యాయి. మరి కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు.రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే (south central railway)అధికారులు అలర్ట్ జారీ చేశారు
డోర్నకల్- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67767), విజయవాడ- డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67768),కాజీపేట- డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67765), డోర్నకల్- కాజీపేట (ట్రెయిన్ నెంబర్ 67766),విజయవాడ- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12713),సికింద్రాబాద్- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 12714) విజయవాడ- భద్రాచలం రోడ్ (ట్రెయిన్ నెంబర్ 67215),భద్రాచలం రోడ్- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67216), గుంటూరు- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12705),సికింద్రాబాద్- గుంటూరు (ట్రెయిన్ నెంబర్ 12706), సహాయం కోసం 139 డయల్ చేయవచ్చు అని రైల్వే అధికారులు సూచించారు.