గల్ఫ్ కార్మికుల సమస్యల అధ్యయనానికి సలహా కమిటీ

తెలంగాణ సర్కారు గల్ఫ్ కార్మికులకు శుభవార్త వెల్లడించింది.గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి సూచనలు చేయడానికి త్వరలో సలహా కమిటీని ఏర్పాటు చేయనుంది.

Update: 2024-10-30 13:03 GMT

గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు చేయడానికి త్వరలో అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.దీనిపై సీఎం ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి హైదరాబాద్ ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' కౌంటర్ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం అన్నారు.


గల్ఫ్ ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రం
సౌదీ అరేబియాలో మృతి చెందిన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పులి అంజయ్య కుటుంబానికి మంగళవారం రూ.5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక కార్యక్రమంలో అందజేశారు.చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గల్ఫ్ గ్యారంటీల అమలు
కాంగ్రేస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 'గల్ఫ్ గ్యారంటీ' ని అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులు బి. మహేశ్ కుమార్ గౌడ్ కు, మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు అందరికీ కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.


Tags:    

Similar News