మరో వైద్య విద్యార్థి తనువు చాలించాడు

ఆదిలాబాద్ రిమ్స్ లో..;

Update: 2025-07-30 12:56 GMT

 ఆదిలాబాద్  రిమ్స్‌లో వైద్య విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనమైంది. రాజస్థాన్‌కు చెందిన సాహిల్‌ చౌదరి (19) ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం అతడు హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తోటి విద్యార్థులు గుర్తించి ఆయనను రిమ్స్‌కు తరలించారు. విద్యార్థిని వైద్యులు పరీక్షించగా అప్పటికే మరణించించారు. డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, పోలీసులు హాస్టల్ కు చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను సేకరించారు. రిమ్స్ అధ్యాపకులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసారు. ఆత్మహత్యగల కారణాలు తెలుసు కుంటామని రిమ్స్ డైరెక్టర్ చెప్పారు. పోలీసులు విద్యార్థి సెల్ ఫోన్ కాల్ డాటాను పరిశీలిస్తున్నారు. ఆగస్టు రెండు నుంచి ఎంబీబీఎస్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంతలో ఇలా జరుగడటంతో మెడికల్‌ కాలేజీలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాహిల్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది

అనారోగ్యంతో ఉండేవాళ్లకు వైద్యం చేసి, ప్రాణాలు పోయాల్సిన వైద్య విద్యను ఎంచుకుంటున్న విద్యార్థులు తమ ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు. ర్యాగింగ్‌, సీనియర్ల వేధింపులు, తీవ్రమైన పనిభారం తదితర కారణాలతో వైద్యవిద్యార్థులు బలవంతంగా అసువులు భాస్తున్నారు.
Tags:    

Similar News