హైదరాబాద్ లో కొట్టుకుపోయి… వలిగొండలో తేలి
85 కిలోమీటర్లు కొట్టుకుపోయిన మామ, అల్లుళ్లు
By : The Federal
Update: 2025-09-18 14:21 GMT
హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్జల్ సాగర్ లో గల్లంతైన వరుసకు మామా అల్లుళ్లలో ఒక మృత దేహం గురువారం కనిపించింది. దాదాపు 85 కిలో మీటర్లు కొట్టుకుపోయి నల్గొండ జిల్లా వలిగొండలో అర్జున్ మృతదేహం తేలింది. ఈ నెల 14న ఇంట్లో వర్షపు నీరు చేరే క్రమంలో రాము(25), అర్జున్(26) వస్తువులను బయటకు తీసు కెళుతుండగా దురదృష్ట వశాత్తు అప్జల్ సాగర్ లో పడిపోయారు. అర్జున్, రాము ఒకే ఇంట్లో ఉండేవారు. అర్జున్ మృత దేహం కనిపించినప్పటికీ రాము మృత దేహం కనిపించలేదు. హైడ్రా, డిఆర్ఎప్ సిబ్బంది మూడు రోజుల నుంచి వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. అర్జున్ మృతదేహం కనిపించినట్లు హైడ్రా అధికారులు చెప్పారు. రాము కోసం వెతుకుతున్నట్టు వారు తెలిపారు.