‘రాహుల్ గాంధీ చెప్పేదొకటి, రేవంత్ రెడ్డి చేసేదొకటి’

నర్సంపేట నుండి ప్రారంభమైన బీసీ రాజాధికార సమితి ఉత్తర తెలంగాణ వ్యాప్త జిల్లాల యాత్ర...;

Update: 2025-04-11 14:52 GMT
Image source: Revanth Reddy X

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బీసీ రాజ్యాధికార సమితి ముఖ్య కార్యవర్గం ఉత్తర తెలంగాణ నూతన జిల్లాల యాత్రను నర్సంపేటలో ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర కార్యదర్శి ముంజాల రాజేందర్ గౌడ్ నేతృత్వంలో నర్సంపేట పట్టణంలోని మేరు సంఘ భవనంలో పెద్ద ఎత్తున పూలే జయంతి ఉత్సవాలను బీసీ రాజ్యాధికార సమితి వరంగల్ జిల్లా నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు కులాల ప్రతినిధులు, సహకార సంఘాల పెద్దలు,కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. పూలే దంపతులకు పూలమాలలు సమర్పించి,బీసీలకు రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ముందుకు సాగుదామని బలమైన నినాదాలు చేశారు.

తదనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన బి.ఆర్ అంబేద్కర్, పూలే తన జీవిత కాలంలో చవిచూసిన సామాజిక అసమానతులను రూపుమాపే విధంగా చర్యలు తీసుకున్నాని వర్ణించటం, పూలేను తన గురువుగా భావించటం,భావితరాల భవిష్యత్ పట్ల అంబేద్కర్ కు ఉన్న దార్శనికతకు నిదర్శనం అన్నారు. పూలే సమాజం కోసం సర్వము పరిత్యాగం చేయటం, తన భార్యకు సైతం విద్యాభ్యాసం కల్పించి తద్వారా మహిళా వికాసానికి, ఉద్ధరణకు బాసటగా నిలబడటం జ్యోతిరావు పూలే కీర్తి ప్రతిష్టలను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయని దాసు సురేశ్ అన్నారు. 

సామాజిక న్యాయానికి ఆద్యుడు అయిన పూలే ఆలోచనలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అనుసరించాలని చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం అని దాసు సురేష్ పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న సామాజిక న్యాయానికి, రాష్ట్రంలో అమలు అవుతున్న సామాజిక న్యాయానికి ఏ మాత్రం పొంతనలేదని ఆవేదన వ్యక్తం చేశారు . రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు దక్కాల్సిన 42% అవకాశాలను , 4% జనాభా ఉన్న ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి అప్పచెప్పటం ఏ విధమైన సామాజిక న్యాయమో ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉంది అన్నారు.

ఇటీవల నియమించిన యూనివర్సిటీల వైస్ ఛాన్సులర్లు,లోకాయుక్త, సీఎంఓ (ముఖ్యమంత్రి) కార్యాలయ అధికారులు,కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీల కేటాయింపులు, ఉదయపూర్ డిక్లరేషన్ ఉల్లంఘన తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్న లోపభూయిష్ట విధానాలకు తార్కాణం అన్నారు..
ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బిసి, ఎస్సి, ఎస్టీలపై పాశుపతాస్త్రంగా సంధించగా, అట్టి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం,ఆ బిల్లును తెలంగాణలో అమలు చేయడం, బిసి ఎస్సి, ఎస్టీల అవకాశాలను హరించటం అత్యంత దయానీయమన్నారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బిసి క్షేత్రస్థాయి న్యాయకత్వ నిర్మాణాన్ని గావించడం నర్సంపేటలో ప్రారంభించామని,త్వరలోనే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కమిటీలను నియమించి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలను పోటీకి సిద్ధం చేస్తామన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి మాట్లాడుతూ మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా లేకపోవడం దారుణమని, బీసీ మహిళా లోకాన్ని చైతన్య వంతం చేసి క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తాం అన్నారు.
రాష్ట్ర కార్యదర్శి ముంజల రాజేందర్ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో త్వరితగతిన క్యాడర్ నిర్మాణం గావించి త్వరలోనే రాష్ట్రస్థాయి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. తదనంతరం వంగ రవి యాదవ్ ను నర్సంపేట ఇన్చార్జిగా నియమిస్తూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి గండి వీరేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ తిరుపతి,పద్మశాలీ సంఘం రాష్ట్ర నాయకులు వైద్యం రాజగోపాల్ ,మేరు సంఘం అధ్యక్షులు రాయగిరి యాదగిరి, మహబూబాబాద్ జిల్లా నాయకులు రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ పెద్దకాసు కుమార్ స్వామి,యాదవ్, నర్సంపేట కన్వీనర్ కొండ శ్రీశైలం యాదవ్, గౌరవ సలహాదారుడు రామగిరి యాదగిరి స్వామి మేరు, మేరు సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల హరి ప్రసాద్, ఓబీసీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మేర సంఘం టౌన్ అధ్యక్షులు, రామగిరి రవికుమార్, మండలాధ్యక్షులు ఓడపల్లి గోవర్ధన్, రాష్ట్ర మహిళా ఉప ధ్యక్షురాలు ఏరుకొండ హైమావతి, కరీంనగర్ మహిళా ఇన్చార్జి జంగోని స్వరూప, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గండి వీరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కొడుపు గంటి శ్రీధర్, హనుమకొండ జిల్లా ఇన్చార్జి గోవిందుల జనార్ధన్, ముంజల సదానందం, సంజీవ, బందారం శ్రీను, కొక్కు అశోక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News