తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి విజయం
తెలంగాణలో రెండు స్థానాలకు జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు. కాంగ్రెస్ కు నిరాశ;
తెలంగాణలో రెండు స్థానాలకు జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల్లో కరీంనగర్ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధిం చింది. మరొక చోట పీఆర్టీయూ అభ్యర్థ్థి గొలుపొందారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓటులోనే విజయం సాధించారు. కొమురయ్యకు 12,959 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. పీఆర్టీయూ అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు లభించాయి.
విశేషమేమిటంటే, ఆంధ్రలో కూడా బిజెపి అనుకూల అభ్యర్థియే గెలుపొందారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టీయూ తరపున పోటీ చేసిన డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొంది తెలుగుదేశం, జనసేలకు షాక్ ఇచ్చారు.నాయుడిని బీజేపీ వారు బహిరంగంగానే బలపరిచారు. ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్న టీచర్లంతా కలిసి కట్టుగా నాయుడుకు ఓట్లు వేసి గెలిపించారు.
తెలంగాణలొ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించి అనుకున్న ఫలితం సాధించింది. మిగతావారికంటే ముందుగా జనవరిలోనే అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య ఎంపిక చేసింది. ఆయన విజయం కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, ఇతర నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఘన విజయం సాధించారు. నిజానికి బండి సంజయ్ తొలి నుంచి బాగా యాక్టివ్ పనిచేస్తున్నారు. పర్యటిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. ఆయన కార్యక్రమాల వల్ల బిజెపి క్యాడర్ లో ఉత్సాహం పెరుగుతూ ఉంది. దీనికితోడు కుంభమేళా వంటి కార్యక్రమాలు కూడా బిజెపిని ఎపుడు సైకాలజికల్ లెవెల్లో నిలబెడుతూ వస్తున్నాయి.
ఇక తెలంగాణ ఓట్ల కౌంటింగ్ ను పరిశీలిస్తే, ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ బండి ల్లుగా విభజించి ఇన్ వ్యాలీడ్ ఓట్లను తొలగించిన అనంతరం 14 టేబుల్ పైకి బ్యాలెట్ పేపర్లను చేర్చి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. 27,888 మంది ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉండగా 25,041 మంది ఓటేయగా, 24,144 చెల్లుబాటయ్యాయి. కౌంటింగ్లో భాగంగా 897 ఓట్లను చెల్లనివిగా తేల్చారు. గెలుపు కోసం 12,073 ఓట్లు అవసరం కాగా, బీజేపీ అభ్యర్థి కొమురయ్య 12,959 ఓట్లతో ఘనవిజ యం సాధించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తత్రెడ్డికి కేవలం 429 ఓట్లు మాత్రమే వచ్చాయి.