జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ప్రత్యేక కమిటీ
విజయం కోసం బీజేపీ కొత్త వ్యూహాలు. కీలక నేతలతో స్పెషల్ కమిటీ.;
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించడం కోసం అన్ని పార్టీలో తహతహలాడుతున్నాయి. ఆ స్థానంలో గెలిచి తమ సత్తా చాటుకోవాలనుకుంటున్నాయి. అందుకే ప్రతి పార్టీ కూడా ఈ ఉపఎన్నికను అసెంబ్లీ ఎన్నికలకన్నా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఉపఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ఈరోజు బీజేపీఎల్పీ కీలక సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు వ్యూహాలపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ప్రత్యేక కమిటీ నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ బీజేపీఎల్పీ నిశ్చయించుకుంది. కమిటీ సభ్యులుగా.. రఘునందన్ రావు, పాయల్ శంకర్, రామచంద్రారెడ్డి, గరికపాటి మోహన్ రావు, గౌతమ్ రావు ఉన్నారు.
ఈ మానిటరింగ్ కమిటీ.. ఉపఎన్నిక సమయంలో అవలంభించే వ్యూహాలు, నిర్వహించే కార్యక్రమాలు వంటి అన్ని అంశాలన పరిశీలిస్తారు. దాంతో పాటుగానే ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్న అంశంపై కూడా వీరు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను, నాయకులకు ఉన్న చరిష్మా, ఫాలోయింగ్ వంటి అనేక అంశాలను పరిశీలించి తమతమ అభిప్రాయాలను పార్టీకి తెలియజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.