స్థానిక సంస్థల్లో బీజేపీది ఒంటరి పోరాటమే

తెలంగాణలో కూటమి లేదా? టీడీపీ, జనసేనను బీజేపీ ఎందుకు కలుపుకోవట్లేదు?;

Update: 2025-01-18 10:55 GMT

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికలను కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మిస్ అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని పార్టీలు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ మేరకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశాయి. క్షేత్రస్థాయిలో ప్రచారాలు స్టార్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం వైఫల్యాలను ఎండగడుతుంటే, అధికార పక్షం తాము చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కూటమిగా పోటీ చేస్తుందా? ఒంటరిగానా? అన్న ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పారాయన. కిషన్ రెడ్డి చేసిన ప్రకటన సరికొత్త అనుమానాలకు తావిస్తోంది.

కూటమి ఏపీకే పరిమితమా?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో కూటమిగా ఏర్పడి బీజేపీ విజయం సాధించింది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వ స్థాపన చేసింది. కానీ ఆ కూటమిని తెలంగాణలో కూడా కొనసాగించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకు కిషన్ రెడ్డి చేసిన ప్రకటనే నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది. టీడీపీ, జనసేన.. తెలంగాణ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టి ఉన్నాయి. తెలంగాణలో కూడా తమ బలాన్ని పెంచుకుంటున్నాయి. కానీ వాటిని కలుపుకోకుండా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి ప్రకటించారు. దీంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని బీజేపీ కేవలం ఏపీకి పరిమితం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

బలం లేనందుకే పక్కన పెట్టారా?

అంతేకాకుండా టీడీపీ, జనసేన పార్టీలు ఆంధ్రలో బలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో అంతంతమాత్రంగానే ఉన్నాయి. టీడీపీ అయితే ఇటీవల సభ్యత్వ నమోదు చేపడితో 1.60లక్షల మంది వచ్చారని చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మరోవైపు జనసేన కూడా తెలంగాణలో తమ కార్యకర్తలను పెంచుకునేర పనిలో దూసుకెళ్తోంది. కానీ ప్రస్తుతం తెలంగాణలో వారికి ఉన్న బలం సరిపోదన్న ఉద్దేశంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా ముందుకు వెళ్లాలని నిశ్చయించుకుందని కొందరు భావిస్తున్నారు. ఒక్కసారి టీడీపీ, జనసేన పార్టీ తెలంగాణలో బలం పుంజుకుంటే ఏపీ కూటమి కాంబో ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని పలువురు విశ్లేషకలు చెప్తున్నారు. ఈ అనుమానాలపై త్వరలో బీజేపీ నేతలు ఎవరైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Tags:    

Similar News