మంత్రివర్గ విస్తరణ కోడ్ ఉల్లంఘనే
ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన బిజెపి
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తుందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానిధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డికి బిజెపి నేతలు గురువారం ఫిర్యాదుచేశారు. ఎన్నికలకోడ్ అమలులో ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టవద్దని బిజెపి నేతలు సుదర్శన్ రెడ్డిని కోరారు.
ఓ వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్టు బిజెపి నేతలు సీఈవోకు ఫిర్యాదు చేశారు. అజారుద్దీన్ గతంలో జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేశారని, ఒక వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బిజెపి నేత పాయల్ శంకర్, మాజీ మంత్రి మర్రశశిధర్ రెడ్డి నేతృత్వంలో బిజెపి బృందం సీఈవోకు ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ నాయకుడు, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ను మంత్రి వర్గంలో తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 31 వ తేదీ మంత్రి ర్గ విస్తరణ చేపట్టనున్నట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయినా ప్రతిపక్ష బిజెపి బృందం కోడ్ ఉల్లంఘన పేరిట ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.
అజారుద్దీన్ ను మంత్రి వర్గంలో తీసుకోవాలని ఇప్పటికే ఎఐసీసీ ఆమోద ముద్ర వేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.