తెలంగాణ సచివాలయంలో డేంజర్ బెల్స్

సీఎం రేవంత్ కాన్వాయ్ వచ్చే మార్గంలోనూ ఊడిపడ్డాయి.;

Update: 2025-07-24 15:53 GMT

తెలంగాణ సచివాలయంలో డేంజర్ బెల్స్ మోగాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా సెక్రటేరియట్‌లో సీలింగ్ పెచ్చులు ఊడి పడ్డాయి.ఒక్కసారిగా పెచ్చులు ఊడటంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెచ్చులు.. సీఎం రేవంత్ కాన్వాయ్ వచ్చే మార్గంలోనూ ఊడిపడ్డాయి. వారం రోజులుగా రిపేర్ పనులు చేస్తున్నప్పటికీ ఇప్పుడు పెచ్చులు ఊడటం కలకలం రేపుతోంది. సచివాలయ భవనం కొత్తగా నిర్మించినప్పటికీ, వర్షాలకు పెచ్చులు ఊడిపోవడం భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తోంది. సిబ్బంది భద్రతపై అధికారులు తక్షణమే దృష్టి సారించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వర్షాకాలంలో భవన నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News