‘గద్దర్‌పై బండి వ్యాఖ్యలు సిగ్గు చేటు’

గోరెటి వెంకన్న, గద్దర్, అందెశ్రీ, తెలంగాణ రాష్ట్ర చరిత్ర కు మూల స్తంభాలు. కాషాయం కండువా కప్పుకున్న వాళ్లకే పద్మ శ్రీ అవార్డులా అని చనగాని దయాకర్ ప్రశ్నించారు.;

Update: 2025-01-27 10:15 GMT

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ వాగ్గేయ కారుడు గద్దర్ పేరు లేకపోవడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ సహా పలువురు ఇతర నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్‌కు ఎందుకు పద్మ అవార్డు అందించలేదని నిలదీశారు. కాగా వారి ప్రశ్నలపై తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలోనే గద్దర్‌పై బండి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు... రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలి. గద్దర్ కు ఎట్లా పద్మ అవార్డులిస్తాం... ఎంత మంది బీజేపీ కార్యకర్తలను మట్టు పెట్టారో తెలియదా? వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే... నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్. తెలంగాణ సెంటిమెంట్ తో ఎవరు లాభపడ్డారో... ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్ధమైంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా ఆయన వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గు చేటని అన్నారు.

‘‘ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం, పద్మశ్రీ, పద్మ భూషణ్ లల్లో తెలంగాణ రాష్ట్ర పై వివక్షే. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి తెలంగాణ రాష్ట చారిత్రపై అవగాహన లేదు. గోరెటి వెంకన్న, గద్దర్, అందెశ్రీ, తెలంగాణ రాష్ట్ర చరిత్ర కు మూల స్తంభాలు. కాషాయం కండువా కప్పుకున్న వాళ్లకే పద్మ శ్రీ అవార్డులా. కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు బండి సంజయ్‌కి. పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులో … రాష్ట ప్రభుత్వ సిఫారాస్‌ను అమలు చేయకపోవడం సిగ్గు చేటు. తెలంగాణ ప్రభుత్వంపై వివక్ష చూపిస్తున్నారు అనడానికి నిదర్శనం. కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. తెలంగాణ కవులు, కళాకారులను కీచపరించినట్లే’’ అని అన్నారు. బుద్ధిస్ట్ మీకు మావోయిస్టుగా మాత్రమే కనబడ్డాడా.. తెలంగాణ ఉద్యమకారుడు,దళిత ప్రజా ఉద్యమకారుడు కనిపించలేదా అంటూ అద్దంకి దయాకర్ కూడా బండి వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Tags:    

Similar News