కాలేజీల బంద్‌పై సీఎం ఫోకస్..

ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలంటూ బంద్‌కు పిలుపిచ్చిన కాలేజీలు.;

Update: 2025-09-15 08:32 GMT

ప్రభుత్వం ఫీజు రియంబర్స్,మెంట్లను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం.. రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలు బంద్ అమలు చేస్తున్నాయి. ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇదే అంశంపై కాలేజీ ఫెడరేషన్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు.. ఆదివారం సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చర్చించిన అంశాలను సీఎం దృష్టికి తెచ్చారు భట్టి.

రూ.8వేల కోట్ల బకాయిలు..

ఫీజురియంబర్స్‌మెంట్ బకాయిలపై ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కార్యవర్గం సమావేశమైంది. ఈ సందర్భంగానే రూ.8వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నట్లు తెలిపింది. ఈ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో విద్యా రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కళాశాలల నిర్వహణ కష్టంగా మారింది. ఇప్పటికే విద్యా మండలి ఛైర్మన్‌కు మెమోరాండం అందించాం. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో కాలేజీలను బంద్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇలా కాలేజీలను బంద్ చేయడం వలల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. విద్యార్థుల భవితవ్యంపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి’’ అని కోరారు.

Tags:    

Similar News