ఉత్తర తెలంగాణ అన్యాయమై పోతాంది, ఆదుకోండి: బిఎస్ రాములు

‘కెసిఆర్ మీది కోపాన్ని ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీద ప్రజలమీద చూపుతారా?’;

Update: 2025-03-24 08:27 GMT

ఇటీవల జగిత్యాల కోరుట్ల ప్రాంతాలు పర్యటించి వచ్చాను. నీళ్ల గురించి అంతటా అసంతృప్తి తో వున్నారు. సకాలంలో ఉత్తర తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు సమస్యను అర్థం చేసుకోలేదు. చెప్పగా చెప్పగా అర్థం చేసుకొని పోచంపాడు వరద కాలువలో రెండు టీృంసీల నీళ్లు విడుదల చేయించే సరికి పొలాలు ఎండి పోయాయి. వానలు వడి వరి భూమికి చరురుచుక పడింది. మామిడి రాలి పోయింది. ఇటీవల

ఉత్తర తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు ఎండ బెట్టారు.

1. పోచంపాడు

2. ⁠కాళేశ్వరం

3. ⁠మిడ్ మానేర్

4. ⁠మల్లన్న సాగర్

5. ⁠అన్ని చెరువులు.

మేడిగడ్డ కాళేశ్వరం గండి పూడ్చితే ఇవన్నీ నిండుతాయి. నిజాం సాగర్తో పాటు నల్గొండకు కల్వకుర్తికి హైదరాబాద్ కు ఫ్యూచర్ సిటీకి కూడా మంచినీళ్లు నీళ్లందుతాయి.

కెసిఆర్ మీద , ఆయన దోపిడి మీద కోపం ను ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీద ప్రజలమీద చూపితే ఎలా? ప్రజలు బతకవద్దా? ఈ ప్రాజెక్టుల్ని నిండితే నింపితేనే అన్ని గ్రామాలకు పట్టణాలకు నల్లా నీళ్లు. ఇలా ఇంత పెద్ద చెయ్యిని రియాక్షన్స్ గల నీళ్ల సమస్య ఇది. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద కాలువ ద్వారా పోచంపాడు నింపి సకాలంలో నీరందించి వుంటే ఉత్తర తెలంగాణ లో వేల ఎకరాల పొలాలు ఎండి పోయేవి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నింపితే ఎల్లంపల్లిలోకి ఎత్తి పోయవచ్చు. కాళేశ్వరం గండి పూడ్చితే నీళ్లు నిలిచేవి. ఎత్తిపోతలతో లక్షలాది ఎకరాలు ఎండిపోకుండా పంట పండేవి. అప్పుడు దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందని , ఇపుడు ఉత్తర తెలంగాణ,కాళేశ్వరం నిర్లక్ష్యం చేయబడుతున్నాయా? ఉత్తర తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు అనే మాట పోకుండా వెంటనే గండి పూడ్చితే వచ్చే వానకాలం అయినా నీళ్లు నిలుస్తాయి. పంటలు ఎండిపోకుండా వుంటాయి.

రెండు టీయంసీలడిగితే ఒక టీయంసీ విడుదల ప్రారంభించి కిందిప్రాంతానికి వృధాగా పోతాయని చెప్పి అర టియంసీ కే వరద కాలువ నింపడం ఆపేసారు. నిలువ చేయడానికి మిడ్ మానేరు ఉండగా కూడా ఇలా జరిగినది. అనుక్షణం పట్టించుకోకపోతే ఇలా వుంటుంది. పోచంపాడు గురించిన ప్రతి మీటింగ్ జగిత్యాల కాడా ఆడిటోరియంలోనే నిర్వహిస్తే చైతన్యం పెరుగుతుంది. మునుపటిలా కాడా( కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ) హెడ్డాఫీస్ అయిన జగిత్యాల లోనే ఆఫీసు పెట్టి నడపాలి.

మిడ్ మానేరు నింపి నల్గొండకు తరలిస్తున్న పోతున్నారు. జగిత్యాల కోరుట్ల పరీవాహక ప్రాంతానికివ్వడం లేదు. దక్షిణ తెలంగాణ ఆధిపత్యంలో ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అర్థమై వుంటుంది.

ఉత్తర తెలంగాణా తిరిగి మేలుకోవాలి! గెలిచినోళ్లు, ఓడిన శాసన సభ్యులు గొంతెత్తండి. ప్రజలను కదిలించండి. ముఖ్యమంత్రిని కలవండి. సమస్య విశదీకరించండి.

ఇది రాజకీయ ప్రతీకారాల సమస్యగా చూస్తే దేశ సంపద రాష్ట్ర సంపద , ప్రజల ఉపాధి నష్టపోతుంది సుమా!! త్వరగా మేల్కొనండి.! మేల్కొలపండి!!


Tags:    

Similar News