సీఎస్‌ పదవికి రాజీనామా చేయనున్న శాంతికుమారి..

ఈ నెల 30న సీఎస్ పదవి నుంచి తప్పుకోనున్నారు. పదవీ విరమణ అనంతరం ఆమె మర్రెచెన్నారెడ్డి సంస్థ వైస్ ఛైర్మన్‌‌గా బాధ్యతలను స్వీకరిస్తారు.;

Update: 2025-04-29 06:45 GMT

తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆమె మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(MCRHRDI) వైస్ చైర్‌ఉమన్‌గా నియమితులయ్యారు. అందువల్లే ఈ నెల 30న అంటే బుధవారం సీఎస్ పదవి నుంచి తప్పుకోనున్నారు. పదవీ విరమణ అనంతరం ఆమె మర్రెచెన్నారెడ్డి సంస్థ వైస్ ఛైర్మన్‌‌గా బాధ్యతలను స్వీకరిస్తారు. ఈమెకు ఇదే సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేశారు.

Tags:    

Similar News